Reddy Dynasty

About Reddy community:
Religions: Hinduism
Classification: Kings, Emperors, Warriors, Generals, and Landlords
Languages: Telugu, Hindi, English, Tamil, Kannada, Marathi
Populated States: Andhra Pradesh, Karnataka, Tamilnadu, Australia, Ireland, United Kingdom,USA.
Population: 10 to 20 million Reddy’s through out the world (yet find exact numbers)
Reddy Sub castes: --> Pokanati Kapu, Pedakanti Kapu, Musugu Kapu, Nallevelama Kapu, Pakanati Kapu,Dommari Kapu, Godugulanati Kapu, Kodithi Kapu, Kuruva Kapu, Paala Kapu, Palle Kapu, Panta Kapu, Sajjana Kapu, Velama Kapu, Yerlam Kapu

History:
Prolaya Reddy: The Reddy dynasty (1325-1424 CE) was established in southern India. The first king of the Reddy dynasty, described himself as one of the four varnas that emergedfrom the shoulders of MahaVishnu. The initial capital of the kingdom was Addanki. Later it was moved to Kondavidu and subsequently to Rajahmundry. Commissioned major repairs to the Srisailam Mallikarjuna Swami temple, and had a flight of steps built from the Krishna river to the temple. Sri Maha Vishnu temple at Ahobilam also repaired. The restoration of peace starting with his reign brought about a revival of literature and the arts. Errana, the translator of the Maha Bharata, lived during his period.
Anavota Reddy (1335-1364 CE) was the successor of Prolaya Vema Reddy.
Anavema Reddy (1364-1386 CE) was the brother of Anavota Reddy. He liberated Rajahmundry fromthe Muslims and razed down a Mazar (which was built on top of a Hindu Temple).
Kumaragiri (Komaragiri) Reddy (1386-1402 CE) was the son of Anavota Reddy. Kataya Vema Reddy, the Senapathi of Anavota Reddy and the brother-in-law of Kumaragiri Reddy, and Pedakomati Vema Reddy always indulged in internal squabbles. Kumaragiri Reddy had two daughters, Anitally and Hariharamba.
Kataya Vema Reddy (1395-1414 CE) suppressed the revolt in Rajamahendravaram and ruled it for 19 years. Harihara. Rayalu, the ruler of Vijayanagara empire, married his daughter Hariharamba to Kataya Vema Reddy on hearing about his valour. He fought many wars with Pedakomati Vema Reddy. He had a son.
Allada Reddy (1414-1423 CE) ruled on behalf of the young Komaragiri Reddy who was only 10 years old at the time. Allada Reddy managed to fend off Pedakomati Reddy twice, and made peace treaties with Vijayanagar and Kalinga
Veerabhadra Reddy (1423-1448 CE) succeeded to the kingdom of Rajamahendravaram. Devaraya II of Vijayanagara came to the support of the Reddy kings against the Gajapathis of Orissa.
The Reddys could not get the support from Mallikarjuna of Vijayanagar, the successor of Devaraya II, in time and lost to Hamvira, the son of Kapilendra Gajapathi.
Gona Buddha Reddy lived during the 13th century so actually belonged to the Kakatiya period. He is famous for his
Ranganatha Ramayanam. His translation of the Ramayana was a pioneering work and is still used during puppet shows
Errapragada of the Kavitraya (The three poets) fame was the court poet of Prolaya Vema Reddy. He is famous for his Telugu rendition of the Aranya Parva left incomplete by Nannaya Bhattu (Aadi Kavi who started the translation of the MahaBharata into Telugu). Errana's translation of the Ramayana in Chapu form (a style of poetry) has been lost. Srinatha was a poet in the Reddy court.
Recent History:
Influenced by their long tradition of being village headmen, Reddy's continue to be very active in local, state and national politics. Particularly in the state of Andhra Pradesh, a number of former chief ministers and business leaders belong to this royal community:
  • Mr. Neelam Sanjiva Reddy (1956 to 60) - First Chief minister of Andhra Pradesh, Read more
  • Mr O.P. Rama Swamy Reddy - First Chief Minister of Tamil Nadu. Link
  • Mr V. Venkata Subba Reddiar - First Chief Minister of Pondicherry. Link
  • Mr Kysamballi Chengalraya Reddy - First Chief Minister of the old Mysore state. Link
  • Mr Konda Venkata Ranga Reddy - Deputy CM of AP (Ranga Reddy District is named after him). Link
  • Mr. Cattamanchi Ramalinga Reddy( CR Reddy) was an educationist and political thinker, essayist and economist, and poet who played a major role in shaping the educational policy in India.
  • The list of chief ministers of AP (who collectively ruled 36+ Yrs after the formation of state in 1956), link
  • Bezawada Gopala Reddy : Worked on different ministries before taking chief Minister of AP , link
  • Neelam Sanjiva Reddy : First CM of AP (56-62) and President of India, also served as Speaker of Lok Sabha. Link
  • Kasu Brahmananda Reddy: CM of AP (64 - 71) , Link
  • Bhavanam Venkataram Reddy, Link
  • Marri Chenna Reddy: CM of AP twice, link
  • Nedurumalli Janardhana Reddy , link
  • Kotla Vijaya Bhaskara Reddy, CM of AP twice & Cabinet minister ... link 
  • Nallari Kiran kumar Reddy: Strategist & CM of AP , link
Other popular Reddy's are:
  • Uyyalawada Narasimha Reddy - led first popular revolt in all of India against British occupation
  • Potu Narsimha Reddy - donor of 10000 Acres land and founder of many villages in Adilabad
  • Annamalai Reddiar (1865-91) lived a short but meaningful life, was born in Cennikulam in Tirunelveli district. He showed talent in writing poetry even as a young boy. He attained proficiency in Thamizh and music at the Tiruvavaduturai Adheenam.
  • Suravaram Prathap Reddy: president for first Andhra Maha Sabha in Mar 1930 at Jogipeta, Kammam, (Raavi Narayana Reddy organized in 1945 at Kammam)
  • Kadapa Koti Reddy: Organized special Andhra maha sabha in Madras - 1931
  • B. Nagi Reddy - Vijaya Productions and founder editor of Chandamama magazine (Dadasaheb Phalke Awardee)
  • B. N. Reddy - film director (First Dadasaheb Phalke Awardee from South India) Vahini Studios
  • H. M. Reddy, a pioneer of the Indian film industry, directed 1st Telugu & 1st Tamil talkie movies. Assistant director to 1st Indian talkie movie: Alam Ara. Started Rohini pictures ltd.,
  • Read "Always on the Reddy" article to find Reddy's success as entrepreneurs, Decision makers, natural leaders.
Always On The Reddy        
  • Rooted to the soil, Reddys bring the same earthiness to business. They are: 
  • Sons of the Soil: Most of Reddy enterprise lies in land, mining, infrastructure and always, at least a minimal amount, of farming.
  • Natural leaders: Confident to the point of being arrogant, a Reddy’s body language is never submissive
  • Strong women: Whether they are in the family business or minding the home, Reddy women always play a part in decision-making - Flashy, flamboyant: Reddys love to display their wealth in the form of flashy cars, huge mansions, exotic holidays and yes, also seriously lavish weddings
  • Wonderful hosts: Reddys know how to make their guests feel like royalty. Their success in the hospitality sector is a natural corollary.
For more, read the article: https://www.outlookindia.com/magazine/story/always-on-the-reddy/282339
-----------------------***----------------------
Factionalism in Rayalaseema, few (heart touching) facts : 
(Ignore movies & their stories....think own)
రాయలసీమలో ఫ్యాక్సనిజం తరువాత: కొన్ని నిజాలు:
  • రాయలసీమ రతనాల సీమగా, తరువాత ఫ్యాక్సన్ సీమగా చూసాము/విన్నాము.
  • అస‌లు సీమ‌లో ఫ్యాక్షన్ మాయ‌మై చాలా కాల‌మైందిగాయం మానిపోయి మ‌చ్చగా మిగిలిందివాళ్ల పిల్లల‌కి ఇది ఒక క‌థ‌గానే తెలుసు..
  • పోయిన వాళ్లంతా పోయారుఉన్న‌వాళ్లు జైల్లో ఉన్నారుఇక‌చాలు… శాంతి కావాలి” - రాయలసీమ
  • అందరి డిఎన్ ఎలో డబ్బొచ్చి చేరిందిగుండె ఉండాల్సిన చోట రియల్ ఎస్టేట్ దిల్ వచ్చి తిష్టవేసింది. ఫ్యాక్షన్ పెంచి పోషించిన రాజకీయ సేవకులు కూడా, భూములు, డబ్బులు బాగా వెనకేశారు.
  • డ‌బ్బు ఉంటే అధికారాన్ని కొన‌వ‌చ్చు, పార్టీ ఏదైనా ప‌నులు జ‌రుగుతాయిఇంకా ఎక్కువ డ‌బ్బులుంటే రాజ్యస‌భ ప‌ద‌విని కొనుక్కోవ‌చ్చు
  • ఒక ద‌శ‌లో ఫ్యాక్షన్‌ను మోయ‌డం కంటే పోలీసుల్నిలాయ‌ర్లను మేప‌డ‌మే క‌ష్టమైంది. - ఒక ఫ్యాక్షన్ నేత
  • నారాయ‌ణ‌, చైత‌న్యల‌కి కూడా కృత‌జ్ఞత‌లు చెప్పుకోవాలిగ‌త 20 ఏళ్లుగా యువ‌కుల్లో ఎలాంటి భావ‌జాలం మొల‌కెత్తకుండా బొన్షాయ్ మొక్కలుగా త‌యారు చేసిన ఘ‌న‌త వీళ్లదే.
  • ఇపుడు ఎవ‌డికి వాడు బాగా బ‌తికితే చాల‌నుకుంటారుఅంతేకానీ ఇంకోడి కోసం చ‌చ్చిపోవాలి అనుకోరు.
  •  మా తాత కత్తి పట్నాడంటే అది అవసరం -  మా నాయన కత్తి పట్నాడంటే అది వారసత్వం -  నేను కత్తి పట్నానంటే అది పిచ్చి తప్ప మరొకటి కాదు. - ఒక సినిమా మాటలు
  • ఆశ్చర్యమేమంటే ప‌ల్లెల్లో ఇప్పుడు ప్రేమ క‌థ‌లు కూడా లేవు.😍అంద‌రూ ప‌ట్నాల్లోనే ఉంటే ఇక ప్రేమించుకునే వాళ్లు ఎవరు😝 
  • ఇంకా పిచ్చి ఏంటంటే: సినిమా వాళ్ళు ఫ్యాక్సన్ మీద సినిమాలు (పల్లె-నగరం నేపథ్యంలో) తీస్తూనే ఉన్నారు..జనాలు చూస్తూనే ఉన్నారు.   - సేకరణ & కూర్పు: _మేకల వీ. రెడ్డి_

Fictionist’s: 

Bogati Narayana Reddy - https://www.youtube.com/watch?v=XqUoH-E3-s4

Varada Rajulu Reddy - https://www.youtube.com/watch?v=_Bu3QPEUoCg

Bhuma Nagi Reddy-  https://www.youtube.com/watch?v=vobwhhPQ600

Peram NagiReddy - https://www.youtube.com/watch?v=BaWFfysx5wk

Thikka Reddy - https://www.youtube.com/watch?v=TEg0BQA5glE   // left away from Village & bought..

-----------------------***----------------------

Read more popular Reddy personalities at link
Kondaveedu Fort

Hampi
Notes: 


Telugu version of story (on Reddies):  రెడ్డి చరిత్ర:
ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాని కి వచ్చి స్తిరపడ్డ రాష్ట్రకూటు లే రెడ్లు గా పిలువబడినారని శాసనాల ఆదారం గా తెలుసుకున్నాము.దక్షిణాని కి వచ్చిన తర్వాత రాష్ట్రకూటులు చాలుక్యుల కాలం లొ గ్రామ పెద్దలు గా పనిచేసారు.ఆ తర్వాత కాకతీయుల కాలం లొ సైనిక అదికారులు గా మరియు సామంత రాజులు గా పని చేసారు.ఇనగాల బమ్మి రెడ్డి,రేచెర్ల నామి రెడ్డి,బేతి రెడ్డి మరియు రుద్రి రెడ్డి లు సైనిక అధికారులు గా పని చేసినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది. కాకతీయులు కూడా రాష్ట్రకూటులేనని క్రిష్ణా జిల్లా మాగల్లు శాసనం మరియు ఖమ్మం జిల్లా బయ్యారం శాసనాలు తెలియజేయుచున్నాయి.బయ్యారం శాసనం గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించినది.మాగల్లు శాసనం చాలుక్య రాజు దనర్నవ వేయించాడు.మాగల్లు శాసనంలో కాకతీయ పాలనకు మూలపురుషుడైన కాకర్త్య గుండన పూర్వీకులు రాష్ట్రకూటులని పేర్కొనబడినది.
రెడ్డి పదోత్పత్తి 7 వ శతాబ్దం నుంచి రక రకాలు గా పేరు మార్చుకుంటు వస్తుంది.మొదట 7 వ శతాబ్దం లొ రట్టగుడి గా, తర్వాత రట్టొటి,రాథొడ్, రట్టాడి, రట్టజికము, రద్రికము,రడ్డి గా మారుతూ వచ్చి చివరకు రెడ్డి దగ్గర స్తిరపడింది. క్రీ.శ.641 వ సంవత్సరము నకు సంబందించిన గుంటూరు జిల్లా మాచర్ల శాసనం లో రట్టగుళ్ళు గా పేర్కొనబడినది. 9 వ శతాబ్దము నకు సంబందించిన వరంగల్ జిల్లా లోని కొండపర్తి శాసనం లో పొలమెయరట్టోడి గా పేర్కొనబడినది.పొలమెయరట్టోడి అనేది గ్రామ పెద్ద లేదా అధికారి పేరు అయ్యి వుండొచ్చు.ఈ శాసనము భూమి కౌలు కు సంబందించిన ఒప్పందము గురించి తెలియ చేస్తుంది.
- 1065 వ సంవత్సరము ప్రాంతము లో రెడ్లు రడ్డిగా పిలవబడినట్లు మెదక్ జిల్లా లోని ములుగు గ్రామము వద్ద లబించిన కల్యాణి చాళుక్యు లకు సంబందించిన శాసనం తెలియజేయుచున్నది.ఈ శాసనము 1065 సంవత్సరమునకు సంబందించినది.ఈ శాసనము ప్రకారము కదిరడ్డి మినిరడ్డి ని గ్రామ పెద్ద గా నియమించినట్లు పేర్కొనబడినది.
- 12 వ శతాబ్దం నాటికి ఇప్పుడు పిలువబడుతున్న "రెడ్డి" పదం వాడకం లోకి వచ్చినట్లు పిల్లలమర్రి శాసనాల ద్వార తెలుస్తుంది.
- పిల్లలమర్రి తూర్పు దిక్కు శాశనం ప్రకారం రేచెర్ల నామిరడ్డి 1117 రాక్షస సంవత్సర వైశాఖశుక్ల త్రయోదశి నాదిత్యవారమునాండు తన పేరు మీద మరియు తల్లిదంద్రుల పేరు మీద శ్రీకామేశ్వర, శ్రీకాచేస్వర శ్రీనామెశ్వర దేవాలయాలను ప్రతిష్టించినట్లు పేర్కొనబడినది.
- పిల్లలమర్రి దక్షిణం దిక్కు శాశనం ప్రకారం రేచెర్ల నామిరడ్డి 1124 శ్రీ దుందుబి సంవత్సర చైత్ర శుక్ల చతుద్దషి శనైశ్చరవారం నాడు శ్రీమన్నామేశ్వరం గుడిని ప్రతిష్టించినట్లు పేర్కొనబడినది.
- పిల్లలమర్రి పడమర దిక్కు శాశనం ప్రకారం రేచెర్ల బేతిరెడ్డి భార్య ఎఱుక సానమ్మ గారు 1130 విభవ సంవత్సరము జ్యేష్టశుద్ద మూడవ సోమవారం నాడు శ్రీఎఱకేశ్వర గుడిని ప్రతిష్టించినట్లు పేర్కొనబడినది.
- నల్లగొండ జిల్లా జలాల్ పురం శాశనంలో గణపతిదేవుని సామంతరాజు చెరుకు బొల్లయ రెడ్డి వంశం గురించి తెలుపబడినది.ఈ శాశనం క్రీ.శ.1202 సంబందించినది.చెరుకు వంశీయులు నల్లగొండ జిల్లా జమ్ములూర్ మరియు మహబూబ్ నగర్ జిల్లా అమరాబాద్ కేంద్రాలుగా క్రీ.శ.1158 నుంచి క్రీ.శ.1323 వరకు పరిపాలించారు.
రెడ్లు క్షత్రియులు అనడానికి అనేక అదారములు లభించెను.
- హంపి న్రుసింహాలయ శాసనంలో ప్రోలరెడ్డి తనను శ్రీరామవంశ సంభవ సుమిత్రపౌత్ర రాష్ట్రకూట రాజు గారి వంశమున పుట్టినవానిగా చెప్పుకున్నాడు.
- మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ శాసనం లో గోన బుద్ధారెడ్డి సూర్యవంశీయుడు గా పేర్కొనబడినది.తిరువల్లూరు లొని వీర రాఘవస్వామి ఆలయములోనున్న పెద కోమటి వేమారెడ్డి శాసనంలో తాను సూర్యవంశస్తుడిగా పేర్కొన్నాడు.శ్రి వైకుంట విష్ను క్షేత్రము నందు వున్న శాసనము లో రాజమహేంద్రవరపు నాగిరెడ్డి తనను సూర్యవంశీయుడిగా పేర్కొన్నాడు.పట్టమెట్ట సోమనాథ సోమయాజి సూత సంహిత అను పద్య కావ్యాన్ని రాసి దోమకొండ సంస్థానాదీషుడైన కామారెడ్డి కి అంకిత మిచ్చెను మరియు బ్రహ్మోత్తర ఖండ అనే కావ్యాన్ని రాసి కామారెడ్డి సోదరుడైన యెల్లారెడ్డి కి అంకితమిచ్చెను. పట్టమెట్ట సోమనాథ సోమయాజి సూత సంహిత కావ్యంలో దోమకొండ సంస్తానాదీషుడగు కామారెడ్డి ని సూర్యవంశీయుడు గా పేర్కొన్నాడు.గద్వాల సంస్తానాదీషుడైన చిన సోమభూపాలుని(1752-1793) ఆస్తాన కవి అయిన కాణాదం పెద్దన సోమయజి ఆద్యాత్మ రామాయణం కావ్యములో చిన సోమభూపాలుని పూర్వీకుడైన సోమభూపాలుని సోమవంశజుడిగా చెప్పియున్నాడు.
రెడ్లలో శాఖలు: రెడ్ల లొ అనేక శాఖలు ఉన్నవి.అందులొ మొటాటి, పాకనాటి,వెలనాటి,గుడాటి, పంట(దేసటి),పెడకంటి,కుంచేటి, రేనాటి,ఓరుగంటి,భూమంచి మొదలైనవి తెలుగు ప్రాంతాల్లొ వినిపిస్తుంటవి.ఇందులొ కొన్ని నివాస ప్రాంతాల పేర్లతో యేర్పడితె మరికొన్ని కట్టుబాట్లు మరియు నడవడిక తో యేర్పడినట్లు తెలుస్తుంది. మొటాటి (మొట్టనాడు),పాకనాటి (పాకనాడు), వెలనాటి (వెలనాడు), రేనాటి( రేనాడు) ప్రాంతాల ఆదారం గా ఎర్పడినట్లు తెలుస్తుంది.
పాకనాడు,రేనాడు మరియు వెలనాడు రెడ్లు: పాకనాడు, వెలనాడు, రేనాడు అనేవి ఒకప్పుడు తెలుగు చోళులు పరిపాలించిన రాజ్యాల పేర్లు.గుంటూరు జిల్లాలోని నరసారావుపేట,గురజాల మరియు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతాలను కలిపి పల్నాడు సీమ అంటారు.గోదావరి, పెన్నా నదుల మద్య ఉన్న రేపల్లె మరియు తెనాలి ప్రాంతాలను కలిపి వెలనాడు అంటారు.నెల్లూరు చుట్టు ప్రక్కల ప్రాంతాలను పాకనాడు అంటారు.కడప ప్రాంతాన్ని రేనాడు చోలులు పాలించినారు అందుకే ఈ ప్రంతాన్ని రేనాడు గా పిలుస్తారు.
  • పాకనాడు,రేనాడు మరియు వెలనాడు తొ ప్రాంతాలు ఉండడం వలన పాకనాటి రెడ్లు , రేనాటి(రేనాడు) మరియు వెలనాటి రెడ్ల విషయంలో స్పష్టత వచ్చింది.
  • మొటవాడ (మొటాటి) రెడ్లుతెలంగాణ ప్రాంతం తో పాటు కర్నూలు,క్రిష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో ఎక్కువ గా ఉన్నటువంటి మొటవాడ (మొటాటి) రెడ్లు ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రావాలి. కవి రెడ్రెడ్డి మల్లారెడ్డి (1650-1700) ప్రాంతం లొ రాసిన పద్యం లొ తాను మోటవాడ వంశానికి చెందిన వ్యక్తి గ చెప్పుకున్నాడు.అంతేకాకుండ తన తాత గ్రామ చౌధరి గా పనిచేసినట్లు పేర్కొన్నాడు.
"ప్రోల్వాల గోత్ర పవిత్ర కోనమదేవి కళత్ర మోటవాడ వంశ వారాశిజనిత కైరవమిత్ర 
బుధ బంధు సుకవిజన స్తొత్ర" - రెడ్రెడ్డి మల్లారెడ్డి
"ప్రోల్వాలగోత్ర సంపూర్ణాభిచంద్రుడు 
మల్లభూనాధుండు మాన్యయశుడు
అందలంబును తశ్రీపు లందుకొనుచు
సరస బూర్గులపట్టణ చౌధరగుచు
ప్రజల బాలించె భూభుజుల్ ప్రస్తుతింప" - రెడ్రెడ్డి మల్లారెడ్డి
  • సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం అలంపూర్ ను పాలించిన రెండవ తిమ్మ భూపాలుడు (తిమ్మ రెడ్డి) తాను మొట్టవాడ కు సంబందించిన వ్యక్తి గా పద్యాల్లొ రాసుకున్నాడు.దీన్ని బట్టి మొట్టవాడ నె మొటాటి అని,ఇది ఒక ప్రాంతానికి సంబందించిన పేరు అని తెలుస్తుంది.
"అట్టి గంగ కు తోబుట్టువగు చతుర్ధ 
జాతియందు నితాంత విఖ్యాతిదనరు
చున్న మొటవాడకులమున నొప్పు మీరే
చాల బిజ్జుల దాద భూపాలమౌలి" --- తిమ్మ భూపాలుడు
  • మొట్టవాడ అనే పేరు కు దగ్గరగా పోల్చిచూస్తె వరంగల్ పట్టణంలో మట్టెవాడ అని ఒక ప్రధానమైన వీది ఉన్నది.మొట్టవాడ రెడ్లు మట్టెవాడ ప్రాంతం నుంచి వచ్చి ఉంటారని స్వర్గీయ సురవరం ప్రతాప రెడ్డి గారు అబిప్రాయపడినారు.సురవరం ప్రతాప రెడ్డి గారు ఇంకా కొంతకాలం జీవించి ఉంటె మొటాటి శాఖ విషయం లో పూర్తి స్పష్టత వచ్చి ఉండెది.
  • అయితే మొటవాడ ను పోలిన మరో ప్రాంతం పేరు మొట్టవాడినాడు.ఒకప్పటి పల్నాడు సీమలో బాగంగా ఉన్న మార్కాపురం ప్రాంతాన్ని మొట్టవాడినాడు గ పిలిచేవారు.దీనిని బట్టి అలోచిస్తే మొటవాడ (మొటాటి) రెడ్లు పల్నాడు ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చు అనేదానికి కొంత బలం చేకూరుతుంది.అయితే పల్నాడు లో తరచుగా జరిగెడి యుద్దాలవలన మొటాటి రెడ్లు కొందరు తెలంగాణా ప్రాంతాలకు తరలివెల్లి వుండొచ్చు.
  • కొనిదెన (కాట్యదొన) 1150 సంవత్సరం శాసనం లో త్రిభువనమల్లదేవ పొత్తపి చోడ మహరాజు కమ్మనాడు, గుండికర్రు మరియు మొట్టవాడి ప్రాంతాలను జయించినట్లు పేర్కొనబడినది.మొట్టవాడి-నాడు గురించి కల్యాణి చాలుక్యుల సంబందించిన త్రిపురాంతకం ఆలయ శాసనం లో చెప్పబడినది.త్రిపురాంతకం ఆలయ శాసనం ప్రకారం మొట్టవాడి-నాడు లో కవలకుంట,రాచగొండ,సతకోడు, ముత్తువాలు, కంభంపాడు,మ్రానెపల్లి, మేడపి,గుట్టలపల్లి, మిరియంపాడు మరియు దువ్వలి మొదలగు గ్రామాలు ఉండెవి.బాపట్ల శాషనంలో కూడా మొట్టవాడి గురించి ప్రస్తావించబడినది.బాపట్ల శాసనం ప్రకారం మొట్టవాడి-నాడు యొక్క త్రిపురాంతక ఆలయానికి పుల్లలచెరువు అనే గ్రామాన్ని ఇచ్చినట్లు వ్రాయబడినది.
  • కమ్మనాడు క్రింద ప్రెంపల్లి,మధుకంబల్లి, పల్లమెట్ట, ఉప్పుగుండురు, పెద్ద గంజాం, కదకుడురు, కురవద, పయుందొర్రు, చిన్న గంజాం,కణుపరితి, పులిచెరువు, కోత్యదొన, అక్కరజు చెరువు,బల్లికురువ, గుందియపుండి, జొన్నప్రాలురు, అమ్మలపుండి,ఎద్దనిపుండి, రామకురు,చెంజెర్వు, కొప్పరం,సోఘరేవు మొదలగు గ్రామాలు ఉన్నట్లు ఇతర అదారాలను బట్టి తెలిస్తుంది.
  • పంట రెడ్లు: 12,13 వ శతాబ్దంలలో పంట రాజ్యము నెల్లూరు చోడుల పరిపాలనలో భాగం గా వుండెది.పంట రాజ్యము లో నివశించినవారె పంట రెడ్లు గా పిలవబడియుంటారని చరిత్రకారులు అబిప్రాయపడినారు. అల్లయ వేమారెడ్డి శాశనము లో ఇలా పేర్కొనబడినది.
"పంట కులములో ప్రోల్వాల గోత్రోద్భవుదైన దొడ్డ నరేంద్రుడు జన్మించెను."

మహాకవి శ్రీనాధుడు పల్నాటి వీరచరిత్ర గ్రందం లొ నాగమ్మను పంట రెడ్డి కోడలుగా పేర్కొన్నాడు.
“పంటరెడ్డివారి పణతి యనంగ ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రి
మేకపోతుల రెడ్డి మేనకోడలును ఆరవెల్లి వారింటి అమర కోడలును”

- పంట రెడ్డి వంశస్తులు అద్దంకి ని రాజధాని గా చేసుకుని రెడ్డి రాజ్య స్తాపనకు పునాది వేశారు, తర్వాత కొండవీడు కు రాజధాని ని మార్చి పరిపాలనను కొనసాగించారు.ప్రొలయ వేమారెడ్డి,అన వోటారెడ్డి, అన వేమా రెడ్డి,కుమర గిరిరెడ్డి,కటయ వేమారెడ్డి,అల్లాడ రెడ్డి,వీర భద్రారెడ్డి మొదలగు వారు దాదాపు 123 సంవత్సరములు పరిపాలించారు.
- కొండవీడు ను పాలించిన రాజులను దేసటి రెడ్లు అనికూడ పిలిచేవారు.దేసటి రెడ్డి(దేశ రట్టొడి నుంచి వచ్చింది) అంటె స్తానిక రెడ్లు అని అర్థం వచ్చును.దేసటి అనేది పంట రెడ్ల లొ ఒక రకం అయ్యికూడ ఉండొచ్చు.
- పంట కులము లో పద్నాలుగు రకాలు వున్నట్లు గా 15 వ శతాబ్దపు అరవీడు వంశానికి చెందిన బుక్కరాయల కాలం నాటి భట్టు రాజు చెప్పిన పద్యం ద్వార తెలుస్తుంది.
"పంటాన్వయమునను పద్నాల్గుశాఖల
జక్కగా వివరింతు సత్యమరసి
మొటాటి వెల్నాటి మొరస నేరే డయోద్య
పంట పొంగలినాటి పాకనాటి
భూమంచి కురిచేటి మున్నూటి దేసటి
యొనర గండియకోట యోరుగంటి
యన ఒరగుచునుండు నంధ్రావనీస్థలి
గౌరవాదిష్ఠిత కాపు కులము
పంట పదునాల్గు కులములం చంట జగతి
దర తరంబుల నుండియు వరలెడినుడి
వీనికుపజాతు లున్నవి వివిధములుగ
భుజబలాటోప పిన్నమ బుక్క భూప"
  • భూమంచి రెడ్లు: భూమంచి పదం బహుమంచి(చాలా మంచివారు) నుంచి ఏర్పడినట్లు కొందరి అబిప్రాయము.మంచి భూమి ని కలిగి ఉన్నవారు అని మరి కొందరి అబిప్రాయము. భూమంచి రెడ్లు ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాల్లొ ఎక్కువ గ ఉంటారు.
  • దేశ్ ముఖ్,దేసాయి మరియు చౌధరి: దేశ్ ముఖ్,దేసాయి మరియు చౌధరి అనేవి రెడ్ల శాఖలు కావు.వివిద హోదాలల్లో పనిచేసిన రెడ్లు రాను రాను అవే తమ శాఖలు గా చెప్పుతున్నారు కాని అవి కేవలము రెడ్ల హోదా మరియు స్తోమతను బట్టి పిలవబడిన పేర్లు మాత్రమే. దేశ్ ముఖ్, దేసాయి మరియు చౌధరి మొదలగునవి ఉత్తరాదినుంచి తెలుగు ప్రాంతానికి వచ్చినవి.దేశ్ ముఖ్ మరాఠ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తది.దేశ్ ముఖ్ అనే టైటిలు తో కొన్ని గ్రామాల భూముల పైన లేదా కొంత భూబాగం పైన హక్కులు కలిగి ఉన్నవాల్ల ను పిలిచేవాల్లు.దేసాయి దేస అనే సంస్క్రుత పదం నుంచి వచ్చింది. దేస అంటె భూమి(ల్యాండ్).పాలనా పరం గా ల్యాండ్ లార్డ్స్ (జమిందారులు) ను దేసాయి గా పిలిచేవాల్లు.రెడ్రెడ్డి మల్లారెడ్డి పద్యాల లొ చెప్పినదానిని బట్టి చౌధరి అనేది కేవలం ఒక హోదా నే అని అర్థం అవుతుంది.కొంత మంది చౌధరి రెడ్డి శాఖ అని చెప్పుతుంటారు, కాని చౌధరి రెడ్డి అంటే శిస్తు వసూలు చేసే గ్రామ పెద్ద అని మల్లారెడ్డి పద్యాల ద్వార తెలుస్తుంది.
  • తెలంగాణా లొ దొరలు మరియు పటేండ్లు : తంజావూరు ను 1600 సంవత్సరము నుంచి 1634 సంవత్సరము వరకు పాలించిన రఘునాథ నాయకులు తను రాసిన రఘునాథనాయకాభ్యుదయం గ్రంధంలొ పాలకులను దొరలు అని సంబోదించారు.పటేలు అనే పదం ఉత్తర భారత దేశం నుంచి వచ్చింది.గుజరాత్ లొ పటేలు అనే పదం దాదాపు 15 వ శతాబ్దం నుంది వాడుకలొ వున్నది.దొర మరియు పటేలు అంటె కులం కాదు కేవలం ఒక హోదా మాత్రమె.తెలంగాణ ప్రాంతంలొ దొర మరియు పటేలు అనే పదాలు నిజాం రాజుల పాలన మొదలైనప్పటి నుంచి అంటే 1724 తర్వాత వాడకంలోకి వచ్చినవి.గ్రామాల్లొ నిర్వహించిన పనినిబట్టి దొర లేదా పటేలుగా పిలువబడినారు.ఒకే కుటుంబం కు చెందిన రెడ్డి వంశీయులు వివిద గ్రామాలకు వలసబోయి స్తానికంగా వున్న పరిస్తితులను బట్టి కొందరు దొరలు గా పిలవబడితె మరికొందరు పటేండ్లు గా పిలవబడినారు.అదేవిదంగా ఒకే కుటుంబానికి చెందిన కొందరు వెలమ వంశీయులు వలసబోయి వేర్వేరు గ్రామాల్లొ కొందరు పటేండ్లు గా మరికొందరు దొరలు గా పిలవబడినారు.అయితే గ్రామాల్లొ నిర్వహించిన పనిని బట్టి దొర లేదా పటేలు గా పిలవబడినారు అంతే కాని వీటికి అంత గా ప్రాముఖ్యత లేదు.ఇంకా చరిత్రను తవ్వితె మెదక్ జిల్లా లోని గట్ల మల్యాల గ్రామం లో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వారు,కరీంనగర్ జిల్లా లోని కథలాపూర్ గ్రామం లో వైశ్యు కులానికి చెందిన వారు మరియు వరంగల్ జిల్లా ములుగు మండలం లోని మదనపల్లి గ్రామం లో లంబాడి కులానికి చెందిన వారు నిజాం రాజు దగ్గర గ్రామాదికారాలు పొంది దొరలు గా పిలువబడినారు.
రెడ్ల ఇంటి పేర్లు మరియు గోత్రాలు : గోత్రం ముందు పుట్టి తర్వాత ఇంటిపేర్లు వచ్చాయి.రెడ్ల లొ మొత్తం పదివేల ఇంటిపేర్లు వున్నట్లు చరిత్ర కారులు చెప్పుతారు. మొటాటి లొ 360 గోత్రాలు వున్నట్లు మరియు పాకనాటి లొ 120 గోత్రాలు వున్నట్లు రెడ్ల వద్దకు వచ్చె పిచ్చుకుంట్ల వాల్లు చెప్పుతుంటారు.వీరు కుంటి మల్లా రెడ్డి మరియు అనుముల బ్రహ్మ రెడ్డి కథ చెప్పుకుంటు కొన్ని గోత్రాల పేర్లు చదువుతుంటారు.
ఒకే గోత్ర నామం కలిగి ఉన్నవారు వేర్వేరు శాఖ లలో వున్నారు.అల్లయ వేమారెడ్డి శాశనము లో పంట కులములో ప్రోల్వాల గోత్రోద్భవుదైన దొడ్డ నరేంద్రుడు జన్మించెను అని పేర్కొనబడెను.అదే విదం గా మొటాటి శాఖ కు చెందిన మల్లారెడ్డి తనది ప్రోల్వాల గోత్రమని పేర్కొన్నాడు.దీనిని బట్టి ఒకే గోత్ర నామం కలిగి ఉన్నవారు వేర్వేరు ప్రాంతాలకు వెల్లి పోయిన కారణం గా వేర్వేరు శాఖలు గా పిలవబడినారని అర్థం అవుతుంది.

రెడ్ల రాజ్యాలు మరియు సంస్థానాలు:
మునగాల సంస్తానము కాకతీయ రాజ్యం పతనం కాకముందు నుంచే ఉన్నట్లు తాడ్వాయి దగ్గర మల్లికార్జునస్వామి ఆలయంలో లబ్యమైన రెండు శాసనాలు తెలియచేస్తున్నాయి.ఈ శాసనాలు క్రీ.శ 1300 మరియు 1306 కు సంబందించినవి.
మారయ గణపతి రెడ్డి క్రీ.శ 1300 లో మరియు చెరుకు అన్నయరెడ్డి క్రీ.శ 1306 లో మునగాలను పాలించారు.ఈ శాసనాలు ద్వార మునగాల పాలకులు గణపతి రెడ్డి మరియు అన్నయ రెడ్డి ప్రతాపరుద్రునికి సామంతరాజులుగా ఉండినట్లు తెలియజేయుచున్నవి. 
  • వర్థమానపురం,బుద్దపురం: కాకతీయ రుద్రదేవుడు కందూరు చోళులను జయించి ఆ స్థానం లో గోన బుద్దా రెడ్డి ని సామంత రాజు గా నియమించాడు.గోన బుద్దా రెడ్డి రంగనాథ రామాయణం రాసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.గోన బుద్దా రెడ్డి తర్వాత అతని సోదరుడు గోన లకుమా రెడ్డి మరియు కుమారుడు గోన గన్నా రెడ్డి పరిపాలించారు.గోన గన్నారెడ్డి మహబూబ్ నగర్ లోని బిజినేపల్లి మండలం, వర్థమానపురం (నేటి వద్దెమాని) మరియు బుద్దపురం(నేటి బూత్పూర్) కేంద్రాలు గా పరిపాలన కొనసాగించారు.గోన గన్నారెడ్డి సోదరి కుప్పాంబను కాకతీయ వంశస్తుడైన మల్యాల గుండ దంఢాదీశునికి ఇచ్చి వివాహం జరిపించారు.గోన గన్నారెడ్డి తర్వాత మల్యాల గుండ వర్థమానపురం మరియు బుద్దపురం లను పాలిచారు.
  • గద్వాల: గద్వాల సంస్థానం పాలకులు పాకనాటి రెడ్డి శాఖకు చెందినవారు.గద్వాల సంస్థానం చాలా పురాతనమైనది.గద్వాల ను విద్వద్గద్వాల గా కూడా పిలిచేవారు. కాకతీయులకు ముందు నుంచె గద్వాల ఉన్నట్లుగా చరిత్ర చెప్పుతుంది.కాకతీయులకు గద్వాల సామంత రాజ్యం గా వుండేది.కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు 1290 ప్రాంతంలో గద్వాల పాలకుడైన బుద్దారెడ్డి కి యేడు సీమల మీద అధికారాలు ఇచ్చి నాడేగౌడ గా నియమించాడు.కాకతీయ రాజ్యం పతనం తర్వాత గద్వాల బహమని సుల్తానులకు ఆ తర్వాత నిజాం రాజుకు సామంత రాజ్యం గా వున్నది.17 వ శతాబ్దంలో పెద్దారెడ్డి కర్నూలు కు నాడేగౌడ గా ఉండేవాడు.పెద్దారెడ్డి మరియు బక్కమంబ ల కుమారుడే పెద్ద సోమభూపాలుడు.పెద్ద సోమభూపాలుడు పూడూరు గ్రామంలో జన్మించాడు.పెద్ద సోమభూపాలుడిని నల్ల సోమనాద్రి అని కూడా పిలిచేవారు.గద్వాల కోటను 17 వ శతాబ్దము చివరన పెద్ద సోమ భూపాలుని కాలము లో నిర్మించారు.పెద్ద సోమ భూపాలుడు కర్నూలు నవాబు ను ఓడించి గుర్తుగా 32 ఫీట్ల పొడవున్న పిరంగి ని తీసుకొచ్చి కోటలో ఉంచారు.పెద్ద సోమభూపాలుడు 1712 వరకు గద్వాలను పాలించాడు.గద్వాల చివరి పాలకురాలు ఆది లక్ష్మి దేవమ్మ 1924 - 1949 సంస్థానాన్ని పాలించారు.
  • అలంపూర్ / కొండారెడ్డి బురుజు: కర్నూలు కోటను 1529-1542 వరకు పాలించిన విజయనగర రాజు అచ్యుత రాయని కాలంలో నిర్మించారు.ఆ తర్వాత కర్నూలు గోల్కొండ రాజులకు అనుబందంగా కర్నూలు నవాబు పాలనలో ఉండేది.మహబూబ్ నగర్ లోని అలంపూర్ సీమను 1597-1643 వరకు పాలించిన బిజ్జుల కొండారెడ్డి అనేకసార్లు కర్నూలు నవాబును యుద్దంలొ ఓడించాడు.అయితె కర్నూలు నవాబు గోల్కొండ రాజు సహాయంతొ బిజ్జుల కొండారెడ్డిని బందించి కర్నూలు కోటలో ఉంచాడు.అప్పటినుంచి ఈ కోటను ప్రజలు కొండారెడ్డి బురుజుగా పిలవడం జరిగింది.కొండారెడ్డి సంకెళ్ళను చేదించుకొని సొరంగ మార్గాన్ని తవ్వి కోటనుంచి తప్పించుకున్నారు అయితె గోల్కొండ రాజులు అలంపూర్ సీమను స్వాదీనపర్చుకున్నారు. ఆతర్వాత కొంత కాలానికి కొండారెడ్డి వంశీయులు 1665 ప్రాంతంలొ ప్రక్తూరు ప్రాంతానికి తరలివెళ్ళి వంద గ్రామాలతో చిన్న రాజ్యాన్ని యేర్పరుచుకొని పాలన కొనసాగించారు.ప్రక్తూరు కోటనుంచి పాలించిన వాల్లలొ తిమ్మ భూపాలుడు అనర్ఘరాఘవము గ్రంధాన్ని రాసి ఎంతో పేరు గడించారు.ప్రక్తూరు ప్రాంతము 1790 వరకు బిజ్జుల వంశీయుల పాలనలొ కొనసాగింది.
రెడ్లలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాల్లు:
  • పలనాటి నాగమ్మ భారత దేశంలోనే కాదు, ప్రపంచ రాజకీయ చరిత్ర లోనె మొదటి మహిళా మంత్రి.నాగమ్మ 12 వ శతాబ్దానికి సంబందించినవారు.నాగమ్మ స్వస్థలం కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం అరవెల్లి గ్రామం.నాగమ్మ చిన్న తనంలో ఉన్నప్పుడె,తండ్రి రామిరెడ్డి తన బావ మరిది మేకపోతుల జగ్గారెడ్డి గ్రామమైనటువంటి పల్నాడు ప్రాంతం లోని జిట్టగామాలపాడు గ్రామానికి వలస వెల్లినాడు.రామిరెడ్డి తన మేనల్లుడు సింగారెడ్డి కి నాగమ్మ ను ఇచ్చి వివాహం చేసినాడు.వివాహం అయ్యిన మూడు రోజులకే సింగారెడ్డి పాము కాటు తొ మరణించాడు.నాగమ్మ మంత్రి గోపన్న వద్ద శిశ్యురాలిగా చేరి యుద్ద విద్యలను నేర్చుకున్నది.యుద్ద విద్యలతో పాటు నాగమ్మ పరిపాల నకు సంబందించిన విషయాలపైన చాల పరిజ్ఞానాన్ని సంపాదించి నలగామరాజు ప్రభుత్వం లో మంత్రిగా చేరి,ఎప్పటినుంచో నలగామరాజు దగ్గర మంత్రి గా ఉన్న బ్రహ్మనాయుడు మీద పై చేయి సాదించి తన సత్త చాటుకున్న యోదురాలు.
  • వేమన కొండవీడు రెడ్డి రాజుల కుటుంబం లో జన్మించారు.వేమన 1652 వ సంవత్సరములో జన్మించి వుండవవచ్చని తెలుగు బాష మీద పరిశోదన చేసిన సి.పి.బ్రౌన్ పేర్కొన్నారు. ఎంతో సాదారణ జీవితం గడపిన వేమన నీతిసారము తో పద్యాలు రాసి తెలుగు గడ్డ పై చెరగని ముద్ర వేసారు.
  • ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి భారతదేశంలోనె మొదటి స్వాతంత్ర సమరయోదులు.సిపాయీల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అమరుడు అయినారు.
  • తమిళనాడు మొదట ముఖ్యమంత్రి : సుబ్బారెడ్డి గారూ 
  • కర్ణాటక మొదటి ముఖ్యమంత్రి : చెంగల్ రెడ్డి గారూ 
  • పాండిచే రి మొదటి ముఖ్యమంత్రి : వెంకటరెడ్డి గారూ 
  • రాజస్థాన్ మొదటి ముఖ్యమంత్రి : రవితోడు రెడ్డి గారు 
  • ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి : నీలం సంజీవ రెడ్డి గారు 
"రెడ్డి అనేది కులం కాదు ఒక మతం కాదు అది మన రక్తం రైతు గుండెల్లొ నుంచి నరనరాల్లో నుంచి పుట్టింది రెడ్డి" 
ఇది మన చరిత్రా సోదరులారా
  

  

   



 


  



Disclaimer: Information gathered from various sites and "Reddy's dynasty" developed by Reddy Seva Samiti, Kadapa (Prof. Siva Reddy G). So, it's collection of information only.

 







Comments

  1. can i haave reddy dinasty smybol

    ReplyDelete
    Replies
    1. hi Dhyanesh, Thanks but I don't think there is any symbol for Reddy Dynasty....
      If you are interested, read Reddy dynasty at - http://reddyseva.org/downloads/Reddyrajula%20Charitra.pdf

      Delete
  2. Reddy people are belongs to sudra Varna .they are not Kshatriyas.

    ReplyDelete
    Replies
    1. Yup they are sat-shudra ,called clean shudra not just shudra
      In South society was Brahmin non Brahmin no complete Varna system existed
      Reddys are warrior clan nonetheless they defeated Kshatriya Gajapatis also

      Delete
  3. My name is Rajeswaran Reddy from Malaysia actually here seeking for the background of my great grandfather his name was Veera Reddy and he came over to Malaysia working in railway and survived the communist and he was stabbed for helping British man who crashed in the farm nearby (I will update this story next time ) but I'm eager to know what would be or could be his kulai deivam or the deity they prayers in his village .....the problem is I cant seems to get the name of the village no matter how I tried also but I still gathering information from my relatives. My Uncle which my fathers elder brother he is staying in nagapattinam but he also doesn't know anything much if u could help it would really be a big history update to all my family members

    ReplyDelete
    Replies
    1. hi Rajeswaran, Find out the family name where most of the reddy families are belongs to few hundred families. For example, my family name is: Mekala

      Delete
  4. Telugu version is my article. Not sure why people post every where without my permission.

    ReplyDelete
    Replies
    1. PT Reddy, As I said in my disclaimer, information is gathered here !! Please accept & let me know your confirmation. thx

      Delete
    2. Thanks for your reply. I thought of printing the book. Some people copied the content in bits and pieces from my blog and posted everywhere in FB and YouTube. I did research 20 yrs and wrote lot of details but people misused the content.

      Delete
    3. https://www.facebook.com/ReddyCharitra/

      Delete
  5. Thank you for this valuable information and can anyone help me knowing about the yerlam/ erlam Reddy's dynasty and their glorious history

    ReplyDelete
    Replies
    1. Hi, please connect with Dr. Sivanagi Reddy Emani who did research on Reddy's dynasty and can help you !!

      Delete
    2. sir my name is chitrasenan Dommari kapu also reddy caste correct sir please tell me sir

      Delete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. 22million Reddys lmao shere did you get this figure

    ReplyDelete
  9. This 22.5 million figure where did you get this from
    Reddys are only 6.5 percent in United AP
    This could be around 8million at max today. If you include all other maharastra , kannada , Tamil , abcd ,nri reddys we'll be around 12 million at max

    ReplyDelete
    Replies
    1. Agree with you & changed the number's now.
      Also working with few Organisations to find approx count :) ,will update if successful.

      Delete
  10. Where is motati reddy sub caste in list.. my relatives feel proud of being motati. Any king or kingdom ftom motati?
    Kondaveedu belong to panta reddy

    ReplyDelete
    Replies
    1. That's good Question and need to go through history/books to find more details .. !!

      Delete
  11. Pls let me know any book available

    ReplyDelete
    Replies
    1. Ganesh Reddy, Please read Reddy dynasty on-line at - http://reddyseva.org/downloads/Reddyrajula%20Charitra.pdf

      more printed books (in Telugu) available at Reddy Seva Samithi, Kadapa, Srisailam or CP Brown Library.

      Delete
  12. Any family converted to Christianity / Islam will not come under Reddy community.
    I know it hurts few but any converted (to Islam / Christianity) will come under respective religion !!

    ReplyDelete
  13. Hello Sir, Please give some information about Yerlam Kapu, a reddy sub caste.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Hinduism

పెద్దరికం