పెద్దరికం

 Indian (Elderly) parents are facing loneliness ... we should contribute to improve their lifestyle via: 
  • Value based family eco-system in our society!! 
  • Visiting them - Elderly parents of yours/ your teachers / your friends parents 
  • Call & enquire frequently 
- Mekala Reddy


ఆశ్రమాలే ఆఖరి మజిలీచిన్నబోతున్న పెద్దరికం
ఈ శిల్పం పేరు "శూన్యం", ఇంగ్లీష్ లో అయితే "Emptiness"
పిల్లలు తమను వొదిలి వెళ్ళిపోతే వయసుడిగిన తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభిస్తుందో చెప్పడానికి ఉదాహరణే ఈ శిల్పం. 


లక్షల పదాలు సైతం చెప్పలేని భావనను ఒక శిల్పంలో చూపించిన శిల్పి Albert Gyorgy కి వందనం. 
[ This Statue is called "Emptiness"! It is a great attempt at describing  how parents feel when Children are not with them in OLD AGE,  in any part of the world! Emptiness' original artist  is Albert György! It's a bronze statue located at Lake Geneva, Switzerland! ]

నాకు అమ్మ, నాన్న అత్మీయతను... 
అవ్వ తాతల ప్రేమను
తొడపుట్టిన వారితొ సరదాలను తెంచిన జీవితములొ నీను ఎమి సాధించాలి !?  

వయసు 60 దాటిన  వారికి   ఇవి అన్నీ  ఒకే  సారి  చదువుకోడానికి / పాటించడానికి....... 
  1. సమయం  ఇన్నాళ్ళూ  సంపాదించినదీదాచుకున్నదీ  తీసి  ఖర్చు  పెట్టె  వయసుతీసి  ఖర్చు  పెట్టి  జీవితాన్ని  ఎంజాయ్  చెయ్యండిదాన్ని  ఇంకా  దాచి  అలా  దాచడానికి  మీరు  పడిన  కష్టాన్నికోల్పోయిన ఆనందాలనూ  మెచ్చుకునేవారు  ఎవరూ  ఉండరు  అనేది  గుర్తు పెట్టుకోండి
  2. మీ  కొడుకులూకోడళ్ళూ  మీరు  దాచిన  సొమ్ముకోసం  ఎటువంటి  ఆలోచనలు చేస్తున్నారో?   వయసులో  ఇంకా  సంపాదించి  సమస్యలనూఆందోళనలూ  కొని తెచ్చుకోవడం  అవుసరమా ?ప్రశాంతంగా  ఉన్నది  అనుభవిస్తూ జీవితం  గడిపితే  చాలదా  ?
  3. మీ  పిల్లల  సంపాదనలూవాళ్ళ  పిల్లల  సంపాదనల  గురించిన  చింత  మీకు  ఏలవాళ్ళ  గురించి  మీరు  ఎంత  వరకూ  చెయ్యాలో  అంతా  చేశారుగావాళ్లకి  చదువుఆహారం, నీడ మీకు  తోచిన  సహాయం  ఇచ్చారుఇపుడు  వాళ్ళు  వాళ్ళ  కాళ్ళమీద  నిలబడ్డారుఇంకా  వాళ్ళకోసం  మీ  ఆలోచనలు  మానుకోండి. వాళ్ళ  గొడవలు  వాళ్ళను  పడనివ్వండి .
  4.  ఆరోగ్యవంతమైన  జీవితం  గడపండి.   అందుకోసం  అధిక  శ్రమ  పడకండి. తగిన  మోతాదులో  వ్యాయామం  చెయ్యండి. (  నడక, యోగా   వంటివి  ఎంచుకోండి ) తృప్తిగా  తినండిహాయిగా  నిద్రపోండి.   అనారోగ్యం  పాలుకావడం  వయసులో  చాలా  సులభంఆరోగ్యం  నిలబెట్టుకోవడం  కష్టంఅందుకే  మీ  ఆరోగ్య  పరిస్థితిని  గమనించుకుంటూ  ఉండండి. మీ వైద్య  అవుసరాలూఆరోగ్య  అవుసరాలూ   చూసుకుంటూ  ఉండండిమీ డాక్టర్  తో  టచ్  లో  ఉండండిఅవుసరం  అయిన  పరీక్షలు  చేయించుకుంటూ  ఉండండి.
  5.  మీ  భాగస్వామికోసం  ఖరీదైన  వస్తువులు  కొంటూ  ఉండండిమీ  సొమ్ము  మీ  భాగస్వామితో  కాక  ఇంకెవరితో  అనుభవిస్తారు? గుర్తుంచుకోండి ఒకరోజు  మీలో  ఎవరో  ఒకరు  రెండో  వారిని  వదిలిపెట్టవలసి  వస్తుందిమీ డబ్బు  అప్పుడు  మీకు  ఎటువంటి  ఆనందాన్నీ  ఇవ్వదుఇద్దరూ  కలిసి అనుభవించండి.
  6.  చిన్న  చిన్న  విషయాలకు  ఆందోళన  పడకండి. ఇప్పటివరకూ  జీవితం  లో  ఎన్నో  ఒత్తిడులను  ఎదుర్కొన్నారు.   ఎన్నో  ఆనందాలూఎన్నో  విషాదాలూ  చవి  చూశారుఅవి  అన్నీ  గతం. మీ  గత  అనుభవాలు మిమ్మల్ని  వెనక్కులాగేలా  తలచుకుంటూ  ఉండకండి  ,  మీ భవిష్యత్తును భయంకరంగా  ఊహిచుకోకండి  రెండిటివలన  మీ  ప్రస్తుత  స్థితిని   నరకప్రాయం  చేసుకోకండి. ఈరోజు  నేను  ఆనందంగా  ఉంటాను అనే  అభిప్రాయంతో  గడపండి.   చిన్నసమస్యలు  వాటంతట  అవే  తొలగిపోతాయి
  7. మీ  వయసు  అయిపొయింది  అనుకోకండిమీ  జీవిత  భాగస్వామిని    వయసులో  ప్రేమిస్తూనే  ఉండండి. జీవితాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. కుటుంబాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. మీ  పోరుగువారిని  ప్రేమిస్తూ  ఉండండి"జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ  ఉన్నన్ని నాళ్ళూ మీరు  ముసలివారు  అనుకోకండి. నేను  ఏమిచెయ్యగలనూ  అని  ఆలోచించండినేను  ఏమీ  చెయ్యలేను  అనుకోకండి"
  8. ఆత్మాభిమానం  తో  ఉండండి  ( మనసులోనూ బయటా  కూడా ) హెయిర్  కట్టింగ్   ఎందుకులే  అనుకోకండిగోళ్ళు  పెరగనియ్యిలే అనుకోకండిచర్మసౌందర్యం  మీద  శ్రద్ధ   పెట్టండిపళ్ళు  కట్టించుకోండి. ఇంట్లో  పెర్ఫ్యూమ్ లూ  సెంట్లూ ఉంచుకోండి. బాహ్య  సౌందర్యం  మీలో అంతః సౌందర్యం  పెంచుతుంది అనే  విషయం  మరువకండిమీరు  శక్తివంతులే !
  9. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయిన ఒక  స్టైల్స్ ఏర్పరచుకోండివయసుకు  తగ్గ  దుస్తులు  చక్కటివి  ఎంచుకోండి. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయినట్టుగా  మీ  అలంకరణ ఉండాలిమీరు  ప్రత్యేకంగా  హుందాగా ఉండాలి.
  10. ఎప్పటికప్పుడు  అప్ డేట్  గా  ఉండండి. న్యూస్ పేపర్లు  చదవండి. న్యూస్ చూడండిపేస్  బుక్ , వాట్సాప్ లలో  ఉండండి . మీ  పాత  స్నేహాలు  మీకు  దొరకవచ్చు
  11. యువతరం  ఆలోచనలను  గౌరవించండి. మీ  ఆదర్శాలూ  వారి  ఆదర్శాలూ  వేరు  వేరు  కావచ్చు . అంతమాత్రాన  వారిని  విమర్శించకండి. సలహాలు  ఇవ్వండి, అడ్డుకోకండి. మీ  అనుభవాలు  వారికి  ఉపయోగించేలా  మీ  సూచనలు  ఇస్తే  చాలు. వారు  వారికి  నచ్చితే  తీసుకుంటారుదేశాన్ని  నడిపించేది వారేమా  రోజుల్లో ...  అంటూ   అనకండిమీరోజులు  ఇవ్వేమీరు  బ్రతికి  ఉన్నన్ని  రోజులూ  " ఈరోజు నాదేఅనుకోండి
  12. అప్పటికాలం  స్వర్ణమయం  అంటూ  ఆరోజుల్లో   బ్రతకకండిపాజిటివ్  దృక్పధంసంతోషాన్ని  పంచే  స్నేహితులతో  ఉండండిదానివలన  మీ  జీవితం  సంతోషదాయకం  అవుతుందికఠిన  మనస్కులతో  ఉంటె   మీరూ  కఠినాత్ములుగా  మారిపోతారుఅది  మీకు  ఆనందాన్ని  ఇవ్వదుమీరు  త్వరగా  ముసలివారు  అవుతారు.
  13. .మీకు  ఆర్ధికశక్తి  ఉంటెఆరోగ్యం  ఉంటె   మీ  పిల్లలల్తో  మనుమలతో  కలిసి  ఉండకండి. కుటుంబసభ్యులతో  కలిసి  ఉండడం  మంచిది  అని  అనిపించవచ్చుకానీ  అది  వారి  ప్రైవసీకీ  మీ  ప్రైవసీకీ కూడా  అవరోధం  అవుతుంది. వారి  జీవితాలు  వారివిమీ  జీవితం  మీది. వారికి  అవుసరం  అయినామీకు  అవుసరం  అయినా  తప్పక  పిల్లలతో  కలిసి  ఉండండి.
  14. మీ  హాబీలను  వదులుకోకండిఉద్యోగజీవితం  లో  అంత  ఖాళీ  లేదు  అనుకుంటే  ఇప్పుడు  చేసుకోండితీర్థ  యాత్రలు  చెయ్యడంపుస్తకపఠనం, డాన్స్, పిల్లినో కుక్కనో  పెంచడంతోట పెంపకం, పేకాట  ఆడుకోవడండామినోస్, పెయింటింగ్ ...రచనా  వ్యాసంగం ....పేస్  బుక్...ఏదో  ఒకటి  ఎంచుకోండి.
  15. ఇంటిబయటకు  వెళ్ళడం  అలవాటు  చేసుకోండికొత్త  పరిచయాలు  పెంచుకోండి. పార్కుకి  వెళ్లండి, గుడికి  వెళ్ళండి , ఏదైనా  సభలకు  వెళ్ళండిఇంటిబయట   గడపడం  కూడా  మీ  ఆరోగ్యానికి  మేలు  చేస్తుంది.
  16. మర్యాదగా   మాట్లాడడం  అలవాటు  చేసుకోండినోరు  మంచిది  అయితే  ఊరు  మంచిది  అవుతుందిపిర్యాదులు  చెయ్యకండి. లోపాలను  ఎత్తిచూపడం  అలవాటు  చేసుకోకండి. విమర్శించకండి . పరిస్థితులను  అర్ధం  చేసుకుని  ప్రవర్తించండి. సున్నితంగా  సమస్యలను  చెప్పడం  అలవాటు  చేసుకోండి.
  17. వృద్ధాప్యం  లో  బాధలూసంతోషాలూ  కలిసి  మెలసి  ఉంటాయిబాధలను  తవ్వి  తీసుకుంటూ ఉండకండి. అన్నీ  జీవితంలో  భాగాలే
  18. మిమ్మల్ని  బాధపెట్టిన  వారిని  క్షమించండి. మీరు  బాధపెట్టిన  వారిని  క్షమాపణ  కోరండి. మీకూడా  అసంతృప్తిని  వెంటబెట్టుకోకండి.  అది  మిమ్మల్ని విచారకరం  గానూకఠినం గానూ   మారుస్తుందిఎవరు  రైటు అన్నది  ఆలోచించకండి.
  19. ఒకరిపై పగ  పెట్టుకోవడం  అంటే  విషం  తాగి  ఎదుటివాడు  చావాలి  అని  కోరుకోవడంఅందుచేత  క్షమించుమర్చిపోజీవితం  సాగించు.
  20. నవ్వండి నవ్వించండిబాధలపై  నవ్వండి :) ఎందరికన్నానో  మీరు  అదృష్టవంతులు. దీర్ఘకాలం  హాయిగా  జీవించండి.
వయసు వరకూ  కొందరు  రాలేరు  అని  గుర్తించండి. మీరు  పూర్ణ  ఆయుర్దాయం  పొందినందుకు ఆనందించండి.
-----------------------------------------***-------------------------------------------
నేటి జీవన విధానం
 నేటి జీవన విధానం ఇది.

మారుతున్న కాలంలో
డబ్బు మోజులో పడి తిండిని మానేస్తున్నాము,
డబ్బు మోజులో పడి ఆరోగ్యాన్ని వదిలేస్తున్నాము.
డబ్బు మోజులో పడి మానవత్వాన్ని వదిలేస్తున్నాము.
డబ్బు మోజులో పడి సంస్కారాన్ని వదిలేస్తున్నాము.
డబ్బు మోజులో పడి చివరికి మానవ సంబందాల్ని కూడ పక్కన పెడుతున్నాము.
ఇన్ని వదిలేసి సంపాదించే డబ్బులో ఎముందో
బ్రతకడం కోసం డబ్బు కావాలి కాని ఇక్కడ డబ్బు కోసం బ్రతుకుతున్నాము.

Find out answers to below questions for better & happy life :)
  • Reason for your life !?
  • Goal of life ?
  • Acts / activities will keep you happy, motivated !?
  • Responsibilities you need to perform !?
మనం సహజత్వానికి దూరమైపోతున్నాం !?

ప్రకృతిలో మరే జాతిలోనూ లేదు జీవిని చూసినా.. తల్లి గర్భంలో బిడ్డ ఎంత సహజంగా పెరుగుతుందో.. అంతే సహజంగా బయటకొచ్చి పడుతుందిదీనికోసం కృత్రిమంగా ఆపరేషన్లు చేసి పిల్లలను బయటకు తియ్యటమన్నది ఒక్క మనుషుల్లోనే చూస్తున్నాంచూడటమే కాదు... ఎవరైనా సహజంగా బిడ్డను కన్నారంటే చిత్రంగా చెప్పుకునే వైపరీత్యానికీ చేరుకున్నాం మనం! 
సిజేరియన్ కాన్పునే సర్వసాధారణంగా పరిగణించే దశకు చేరుకోవటం.. ఏమంత మంచి పరిణామం కాదు.

తెల్లారినా లేవమంటున్న వాసులు
ఒక విజేయుడి వెనుక.. ఒక పరాజయుడి వెనుక.. రెండు ప్రధాన తేడాలు కారణాలుగా మిగులుతున్నాయి. 
  • ఒకటి.. తెల్లవారే దినచర్య ప్రారంభించడం.. 
  • రెండు.. లేవగానే ఆ రోజు ప్రణాళికతో సిద్ధంగా ఉండటం.. 
ఇవి పాటించి ఒకరు విజేయులైతే.. నిర్లక్ష్యం చేసి మరొకరు పరాజయం పాలవుతుంటారు. ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచినవారు ప్రపంచాల్నే శాసిస్తారని, ఆ రోజంతా వారిదే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 
  • ఉదయం పనిచేయడానికి, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికే ఈ సృష్టి ఇలా అవతరించింది. కానీ ఇప్పుడు నగరంలో దీనికి విరుద్ధంగా నడుస్తోంది. 
  • తెల్లవారగానే లేచి వ్యాయామం, యోగాతో ముందుకెళ్తే షుగర్‌, బీపీ, థైరాయిడ్‌ స్థాయిలు సాధారణం అవుతాయి. ఆకలి బాగుంటుంది. ఆ సమయంలో మెదడు అద్భుతమైన ఆలోచనల్ని అందిస్తుంది. ఇవి పాటించిన ప్రతీ ఒక్కరూ విజేతలే. 
  • ఒకేసారి ఇది సాధ్యంకాకపోవచ్చు. కానీ కచ్చితంగా వారం రోజుల్లో దీన్నో అలవాటుగా చేసుకుంటారు.
మారే మార్గం ఉంది..
ఉదయాన్నే నిద్ర లేవాలంటే ముందురోజు రాత్రి త్వరగా పడుకోవాలనేది సహజంగా వచ్చే సమాధానం. ఇది కేవలం మాటలతో అయ్యేది కాదనేది చాలామందికి తెలిసిన సత్యం. మరి ముందుగానే పడుకుని, తెల్లవారకముందే లేవడానికి కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
  1. రాత్రి 9.30, 10గంటలలోపే పడుకునేలా బలంగా అనుకోవాలి. అంతకుముందే సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను దూరంగా ఉంచేయాలి.
  2. తెల్లవారుజామున లేచి ఏమేం చేయాలనేది ఒక పేపర్‌మీద రాసిపెట్టుకోవాలి.
  3. పడుకునే కొద్దిసేపటి ముందు కొంతసేపు నడకసాగిస్తే ఆ రోజు ఉన్న ఒత్తిడి దూరమవుతుంది. ఇతర ఆలోచనలూ ఉండవు.
  4. స్నానం చేసి.. శుద్ధి నీరు (చల్లగా వద్దు) తాగి నిద్రపోయేందుకు సిద్ధమవ్వాలి.
  5. నిద్రపోయేటప్పుడు గదిలో వెలుతురు లేకుంటేనే మంచిది.
  6. పడుకునే బెడ్‌ సౌకర్యవంతంగా ఉండేలా.. శరీరానికి చల్లటి గాలి తగిలేలా వాతావరణాన్ని కల్పించుకోవాలి.
వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి.
 వేయి పనులు విడిచి స్నానం చేయాలి .
లక్ష పనులు విడిచి దానం చేయాలి.
కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి

----------------***---------------------------------
సంతోషం 24x7 ఎలా? - సద్గురుజగ్గీ వాసుదేవ్‌ 
ఇప్పుడు..ఉన్నవాళ్లులేనివాళ్లు అనే తేడా లేదు.. అందరిదీ ఒకటే ఆరాటం.. మనసు లోతుల్లో మనకు మాత్రమే తెలిసిన అశాంతి. 
అందుకే మనకిప్పుడు ఏమీ వద్దు..  అశాంతిని పోగొట్టి.. అంతరంగపు అణువణువునూ పులకింపజేసే ఆనందం కావాలి.
చీకటిని తరిమి.. వెలుగును విరజిమ్మే.. విశ్వమంత సంతోషం కావాలిఅదెక్కడో లేదుఏడడుగుల దూరంలోనే ఉందిఆనంద జీవనానికి సద్గురుజగ్గీ వాసుదేవ్‌ చెబుతున్న ఏడు సూత్రాలే ఇవి..
1. ప్రపంచం ఒక పూజాస్థలం:   సృష్టిని గురించి నీకు తెలిసిందెంతఒక మట్టి రేణువు, మీరు నడిచే భూమిపీల్చేగాలితాగేనీరుతినే ఆహారంవాడే ప్రతి వస్తువుపై ఆరాధనా భావం పెంచుకోండిదీని వల్ల మీ జీవన విధానం ఉన్నతంగా రూపుదిద్దుకుంటుంది.
2.  గోతిలో పడిపోవద్దు  క్షణం మరు నిమిషంలో గతం ఖాతాలోకి వెళ్లిపోతుందిగతించిన కాలం తిరిగి రాదుఅలాగే గతం ఒక అనుభవంగా మిగిలిపోవాలే గానీజ్ఞాపకంగా మెదడులో తిష్ట వేయకూడదుచాలా మంది గతంలోనే ఉండిపోతారు. 
మన సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్లడమే తెలివైన పనిఅప్పుడే భవిష్యత్తు బాగుంటుంది.
3. మారాలి... లేదంటే!  కాలం ఎవరి సంతోషం కోసందుఃఖం కోసమో ఆగదుఅలా గడిచిపోతూనే ఉంటుందిఅందుకే జీవితంలో ఉన్న ప్రతిక్షణాన్ని ఆనందంగాఒక ఉత్సవంలా జరుపుకోవాలిరోజూ  గంటయినా భూమిమట్టికి సంబంధించిన పనివాటి స్పర్శ ఉండేలా చూసుకోవాలిదీనివల్ల భౌతికశారీరక స్మృతులు మీకు సహజంగానే కలుగుతాయి.
4. లక్ష్యం కోసం పరుగొద్దు :  పుట్టింది మొదలు పరుగు. జీవితంలోని ప్రతి మలుపులోనూ కష్టపడితే.. మనం కోరుకున్న దాని కంటే ఉన్నతమైన లక్ష్యాన్ని అందుకోగలం సత్యాన్ని గ్రహించి ఎవరి కర్తవ్యాన్ని వారు సరిగ్గా నిర్వర్తిస్తే చాలు.
5. అవి కావు కొలమానాలు మీరు సంతోషంగా జీవించగలగడమన్నది మీ ఇంటి వైశాల్యంపైనోమీ కారు ఖరీదునుబట్టో ఉండదు. తోటివారితో ప్రేమగా మెలిగితే ఆనందం కలుగుతుంది. ఇది ఎవరి కోసమో కాదుమీ సంతోషం కోసమైనా ప్రేమగా ఉండాలిమీరు ప్రేమతో చేసే ప్రతి పనితోనూ ఆనందమయమైన ప్రపంచాన్ని సృష్టించగలరు.
6. వారా గుర్తించేది? ఆనందం ఎక్కడో లేదుఅది నీలోనే ఉంది విషయం తెలుసుకోకుండా.. అది చేస్తే ఆనందంగా ఉండవచ్చుఇది జరిగితే ఆనందం కలుగుతుందని వూహించేస్తున్నాం.
7. సృష్టికర్త ఎక్కడ? కొన్ని విషయాలు పైకి చాలా తేలికగా కనిపిస్తాయికానివాటిని లోతుగా అర్థం చేసుకోవడం కష్టమే!

మనలో ఎవరు కోటీశ్వరులు ? పుట్టుకతోనే మనం కోటీశ్వరులమని... తెలుసా మీకు? 
ప్రపంచాన్ని నీకు చూపించే నీ కన్నుకు విలువ కట్టగలవా... క్షణమాత్రం తీరికలేకుండా పని చేస్తూ రక్త శుద్ధి చేసే గుండె ఖరీదెంతఉచ్ఛ్వాస నిశ్వాసలలో కొలువై ఉంటూ నీ పంచప్రాణాలను కాపాడే ప్రాణవాయువును నీవు బయట కొనుగోలు చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలో లెక్కకట్టి చూడండి... అప్పుడు తెలుస్తుంది భగవంతుడు మిమ్మల్ని ఎన్ని కోట్లకు అధిపతిగా పుట్టించాడో! 
----------------***---------------------------------
విద్య , వివేకం , పరిజ్ఞానం అనేవి బావిలో నీళ్ళలాంటివి... ఎందుకంటే...?? 
వాడుతున్న కొద్ది ఊరుతూనే ఉంటాయి తప్ప..తరగవు.
----------------***------------------------------
జీవితంలో మనం కలవాల్సిన వారిని కాలం నిర్ణయిస్తుంది
మనకెవరు కావాలన్నది హృదయం నిర్ణయిస్తుంది
కానీ మనతో ఎవరు ఉంటున్నారన్నది మన ప్రవర్తన మాత్రమే నిర్ణయిస్తుంది*
కాలం
సంతోషంగా ఉన్నప్పుడు తొందరగా గడిచి పోయింది అనిపిస్తుంది
బాధలో ఉన్నప్పుడు క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది.
 ----------------***------------------------------
చీకటిలో చిరుదీపం వెలిగించిచూడు అదే సూర్యోదయం అవుతుంది...
కష్టాలలో చిరునవ్వు నవ్విచూడు అదే సంతోషాలు సాగరం అవుతుంది...
 ----------------***------------------------------
మనస్సుకు బాధ కలిగించే, మనుషులకు గాని, విషయాలకుగాని
దూరంగా వుండుట మనకు మనం చేసుకున్నే మేలు...

.. *శుభోదయ వందనాలు*
----------------***---------------------------------
In life, everything should be balanced, otherwise !? read below....
మితిమీరితే ....
 🍭మితిమీరిన  ఖర్చు  ...  పేదరికం పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  పొదుపు  ..  కష్టాల పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  సంపాదన  ...  మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.
🍭మితిమీరిన  కర్తవ్యం  ...  అగచాట్ల పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  క్రమ శిక్షణ  ...  రక్త సంబధీకులను దూరం చేస్తుంది.
🍭మితిమీరిన  బాధ్యతలు  ...  అప్పుల పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  హాస్యం  ...  నవ్వుల పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  కోపం  ...  శతృవులను వృద్ధి చేస్తుంది.
🍭మితిమీరిన  ఆలోచనలు  ...  జీవితాన్ని దుర్భరం చేస్తుంది.
🍭మితిమీరిన  వ్యసనాలు  ...  అప మృత్యు పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  స్వార్ధం  ...  అందరినీ దూరం చేస్తుంది.
🍭మితిమీరిన  పోటీ  ...  నష్టాల పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  లాభార్జన  ...  వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది .
🍭మితిమీరిన  వస్తూత్పత్తి  ...  నాణ్యతా ప్రమాణాల దెబ్బ తీస్తుంది.
🍭మితిమీరిన  గర్వాహంకారం  ...  ఆపదలు కొని తెస్తుంది.
 🍭మితిమీరిన అలంకారం  ...  వెగటు పుట్టిస్తుంది.
🍭మితిమీరిన  శృంగారం  ...  వైరాగ్యాన్ని కలిగిస్తుంది.
🍭మితిమీరిన  కామాంధకారం  ...  జీవచ్చవాన్ని చేస్తుంది.
🍭మితిమీరిన  దారిద్రయం  ..  నేరాల పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  అధికార దాహం  ...  హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.
🍭మితిమీరిన  త్యాగం  ...  కడగండ్ల పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  వ్యావసాయకోత్పత్తి  ...  భూమిని నిస్సారం చేస్తుంది.
🍭మితిమీరిన  జనాభా పెరుగుదల  ...  దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.
🍭మితిమీరిన  స్నేహాలు  ...  అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.
🍭మితిమీరిన  గారాబం  ...  చెడు స్నేహాల పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  వేదాంతం  ...  వెటకారం పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  ఈర్ష్ర్యాసూయాద్వేషాలు  ..  నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.
🍭మితిమీరిన   భక్తి  ...  మూర్ఛల పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  తీర్ధ యాత్రలు  ...   నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.
 🍭మితిమీరిన  ఉపవాసాలు  ...  నిస్రాణతకు దారి తీస్తుంది.
🍭మితిమీరిన  ప్రేమ  ...  అనుమానాలకు దారి తీస్తుంది.
🍭మితిమీరిన  నమ్మకం  ..  ద్రోహానికి దోహదం చేస్తుంది.
🍭మితిమీరిన  విశ్వాసం  ...  లోకువ పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  ఋణం  ...  మరణం పాలు చేస్తుంది.
🍭మితిమీరిన  అభిరుచి  ...  దుబారాకు దారి తీస్తుంది.
🍭మితిమీరిన  కీర్తి దాహం  ...  ఆదాయాన్ని మింగేస్తుంది.
అతి సర్వత్ర వర్జయేత్  ...          తస్మాత్  ...                  జాగ్రత  ...   జాగ్రత  ...  జాగ్రత .
🎨 మితా హారం  ... 
🎨 మిత భాషణం  ...
🎨 మితమైన నిద్ర  ...
🎨 మిత సంసారం  ...
🎨 మిత సంపాదన
🎨 మనో కాలుష్య రహితంగా ...
🎨 జీవన యానం సాగిస్తే  ...
🎨 పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు   ...   అదే రాచబాట.
     💦శాంత ప్రశాంత యుతమైన మనశ్శాంతికి   ...   అదే పూల తోట.
     🎯మూర్తీభవించిన మానవతా విలువలకు   ...   అదే పెట్టని కోట.
----------------***---------------------------------
LAWS OF NATURE👍🏻🏻
.... The food we eat, has to be digested and then thrown out of body in 24 hours, else we will fall ill.
.... The water we drink, gets in our body and is thrown out in 4 hours, else we will fall ill.
.... The air we breathe, has to be thrown out in 1 minute, else we will die.
What about negative emotions like hatred, anger, jealousy, insecurity ... we hold in our body for days, months and years.
If these negative emotions are not thrown out regularly it props up into psycho-somatic diseases.
And meditation and prayers are safest way to dissolve these emotions.

 ----------------***---------------------------------

Life is like a Camera. Just focus on What’s important & capture the good times 
Develop from the negatives, and if things don’t work out, Just take another Shot 
 ----------------***---------------------------------

It's nice have village environment & memories :)

నేను చిన్నతనం లో......
  • చేతులు షర్ట్ లోపల ఉంచినా 'చేతులు పోయాయి'అనేవాడిని.
  • రంగుల్లో ఒక పెన్ ఉంటెఅన్ని బటన్స్ ఒకేసారి నొక్కేసేవాడిని ఏంజరుగుతుందో చూసేందుకు.
  • భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాడినివచ్చేవారు ఎంతకీ రాకపోతే విసుగెత్తి నెమ్మదిగా బయటికొచ్చేవాడిని !!
  • నిద్రపోయినట్టు నటించేవాడిని,అమ్మ నాన్న ఎవరోఒకరు బెడ్ వరకు ఎత్హుకు తీసుకు వెళ్తారు కదా అని .
  • కారులో (Bus) వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని  follow అవుతున్నదని గుడ్డి నమ్మకం.
  • ఎలక్ట్రికల్ Switch ని ఆన్ఆఫ్ కాకుండా మధ్యలో నిలబెట్టే ప్రయత్నం చెయ్యడం.
  • రెండు వర్షపు చినుకులు ఒకదానివెంట ఒకటి కిటికీ కొననుండి జారితే ,అది ఒక పరుగు పందెం అనుకోవడం .
  • పండులో గింజ మింగిలోపల చెట్టు మొలుస్తుందేమనని భయపడడం.
  • ఫ్రిడ్జ్ తలుపు నెమ్మది గా మూస్తూ లోపల లైట్ వెలుగు ఎంతవరకు ఆరకుండా ఉంటుందో చూసే ప్రయత్నం.
మీకు గుర్తుందా ! చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహలంపెరిగి పెద్దయిన తరువాత,చిన్నతనం ఎంత బావుండేది అని భాధ !!
బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకంఎందుకంటే మీరు  మెసేజ్ చదువు తున్నపుడు తప్పనిసరిగా మీ మోము పై చిరునవ్వు విరిసి ఉంటుంది.

దేవుడు వరం ఇస్తే మరల ఒకసారి నన్ను  బాల్యం లోకి పంపు అని కోరుకుంటాను.
  • school జీవితం !! కేరింతలు కొట్టే స్నేహ సమూహం !!
  • రంగు రంగుల (even khaki & white) యూనిఫామ్ !!  చిన్న చిన్న ఫైటింగ్ లు !! గ్రూప్ ఫోటోలు !!
  • Combined స్టడీ లు !!  ఎప్పటికి తరగని PT క్లాసులు!!
  • గణతంత్ర దినోత్సవ దినం!! ఎడతెగని వాదోపవాదాలు !! ఎన్నో రుచుల లంచ్ బాక్స్లు !!
  • మరిచిపోలేని మార్కుల కాగితాలు !! భయపెట్టే progress report లు !! సొంతంగా చేసిన "నాన్న సంతకం"
  • తప్పుని correct అని వాదించే సొంత ప్రయత్నం !!
  • గొప్ప ప్రయాణంమరిచిపోలేని మన బాల్యం!! ప్రతి మనసులో కరిగి,కన్నీరుగా మారె మధుర జ్ఞాపకం !!
----------------***---------------------------------

-----------------------------------------***-------------------------------------------
Heart touching (close to real life ) stories....
Story #1:   ఆఖరి మజిలీ.             (THE DETACHMENT)

*ఆమె వయస్సు 65 ఏళ్లు… 
మదనపల్లె నుంచి బెంగుళూర్ కు వెళ్లిపోతోంది… 
అక్కడ లో ఓ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు…అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి… 
ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు… 
ఆమె చదువుకున్నదే… 
ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది.
 వాళ్లందరూ అమెరికా పౌరులు.. అందరికీ ఇద్దరేసి పిల్లలు… వాళ్లంతా హైస్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు… 
ఈమె అమెరికాకు బోలెడుసార్లు వెళ్లింది…కాన్పులు చేసింది…

వెళ్లిన ప్రతిసారీ ఆరు నెలలపాటు ఉండేది… 
ఇక చాలు అనుకుంది…ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు. 
అమెరికాకు వెళ్లాలని లేదు, రానని చెప్పేసింది… 
ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు… 
అందుకే ఆమె సీనియర్ సిటిజెన్స్ హోం కు వెళ్లిపోతోంది… (వాటినే రిటైర్‌మెంట్ హోమ్స్ అనండి)
అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారుట… 

ఆమె ఏమంటున్నదో చదువండి.

‘‘వెళ్తున్నాను… 
ఇక తిరిగి ఎక్కడికీ రాను… 
నా విశ్రాంత, చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను… వెళ్లకతప్పదు… 
తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ… ఎప్పుడో గానీ నేను వారి మాటల్లోకి రాను… 
నేనిప్పుడు ఎవరికీ ఏమీ కాను… ఎవరికీ అక్కరలేదు… 
ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు… అది రిటైర్‌మెంట్ హోం…బాగానే ఉంది… 
ఒక్కొక్కరికీ ఒక సింగిల్ రూం… మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు… టీవీ…అటాచ్డ్ బాత్రూం… బెడ్డు…
ఏసీ కూడా ఉంది… కిటికీ తెరిస్తే బయటి గాలి… ఫుడ్డు కూడా బాగుంది… సర్వీస్ బాగుంది… !!
కానీ ఇవేమీ చవుక కాదు… ప్రియమైనవే…($)
నాకొచ్చే పెన్షన్ బొటాబొటీగా ఈ అవసరాలకు సరిపోతుంది… 
సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే…
అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ఢోకాలేదు…
 నా తరువాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్లిపోతుంది… సో, ఆ చీకూచింత ఏమీ లేదు…
 ‘నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో…’’ అన్నాడు నా వారసుడు…

వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నాను… 
ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా..?  
కాదుగా… బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నీచర్, రోజువారీ మన జీవితంతో పెనవేసుకున్న బోలెడు పాత్రలు… 
అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు… 
సేకరణ అంటే నాకిష్టం… 
 చాయ్ కప్పులున్నయ్…
 అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు…అల్మారాల నిండా అవే… 
బోలెడంత వంట సామగ్రి ఉంది… అరుదైన మసాలాలు… 
ఇవే కాదు, అనేక ఫోటో అల్బమ్స్… ఇవన్నీ ఏం చేయాలి..? 
నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు… 
నా జ్ఞాపకాల్ని అది మోయలేదు… 
అది భద్రపరచదు కూడా… ఏముంది ఆ గదిలో…? 
మహా అయితే ఓ చిన్న కేబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా ఓ చిన్న ఫ్రిజ్, ఓ చిన్న వాషింగ్ మెషిన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్… అన్నీ అవసరాలే… 
కానీ నా జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యాలు కావు…

నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణనూ నాతో ఉంచుకోలేను… 
అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అనీ, అవి నావి కావనీ అనిపిస్తోంది… 
అన్నీ నేను వాడుకున్నాను, అంతే… 
అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే…
 నావి ఎలా అవుతాయి..? 
నా తరువాత ఎవరివో…
 రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు… 
కానీ వాళ్ల తరువాత అవి ఎవరివో…నిజానికి ప్రపంచ సంపద కదా…

మనతోపాటు వచ్చేదేముంది..? 
వెళ్లిపోయేది ఒక్క దేహమే కదా… 
అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను… 
కానీ అవన్నీ కొన్నవాళ్లు ఏం చేస్తారు..? 
నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరేవాళ్లకు దేనికి..? 
వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా… 
బుక్స్ అమ్మేస్తారు… 
నా గురుతులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు… 
ఫర్నీచర్ ఏదో ఓ ధరకు వదిలించుకుంటారు… 
బట్టలు, పరుపులు బయటికి విసిరేస్తారు… 
వాళ్లకేం పని..?

మరి నేనేం ఉంచుకోవాలి..? 
నా బట్టల గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను… 
అత్యవసర వంట సామగ్రి కొంత… 
తరచూ పలకరించే నాలుగైదు పుస్తకాలు… 
ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు… 
చాలు…
 అన్నీ వదిలేశాను… బంధం తెంచేసుకున్నాను… 
నా పొరుగువారికి వీడ్కోలు చెప్పాను… 
డోర్ వేసి, గడపకు మూడుసార్లు వంగి మొక్కుకున్నాను… ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను…

ఎవరో చెప్పినట్టు… ఏముంది.? 
ఓ దశ దాటాక… కావల్సింది ఒక మంచం… ఓ గది ...అత్యవసరాలు… 
మిగిలినవన్నీ గురుతులు మాత్రమే… ఇప్పుడు అర్థమవుతుంది మనకు… 
మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు… 
మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరానివాటిని సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు…
వదిలేయాలి… వదిలించుకోవడమే…

కీర్తి, సంపద, భవిష్యత్తు… అన్నీ ఓ ట్రాష్… 
లైఫ్ అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమే…
 నిజంగా అంతే… 
అరవై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి…
 ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి…
 అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థమవ్వాలి… 
మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు… 
అందుకే బంధం పెంచుకోవడమే వృథా… 
సో, ఆరోగ్యంగా ఉండండి…ఆనందంగా ఉండండి…
 ఏదీ మనది కాదు… ఎవరూ మనవాళ్లు కారు…
 మనిషి ఒంటరి… మహా ఒంటరి… వచ్చేటప్పుడు, పోయేటప్పుడు’’..!!

నీతి : ఎవరికి ఏం అర్ధమయితే అది...

Heart touching & reality of today's parents 🤔 because of Life transformation & అత్యాశ , వాటి పర్వసానాలు అనుభవించక తప్పదు. 😊🙏🏼 (Kerala tops with most Sr. Citizens, then AP in India, like California in US)
అందుకే మన శాస్త్రాలలో జీవిత "ఆశ్రమాలు" గురించి వ్రాసారు వివరంగా:
- బ్రహ్మచర్యం ప్రపక్ష్యామి బ్రహ్మప్రాప్తికరమ్ నృణామ్ (Birth to 25 years)
- గృహస్థ ఆశ్రమం (25 - 50 years)
- వానప్రస్థ (అటవీ నివాసి) (50 - 75 years); వానప్రస్థ అనేది ప్రాపంచిక బాధ్యతల నుండి క్రమంగా వైదొలగే కాలం.  
- సన్యాసం (త్యజించడం)  (75 years onwards) ఒక వ్యక్తి తన భౌతిక ఆస్తులన్నింటినీ త్యజించవలసిన కాలం; మరియు స్వీయ సాక్షాత్కారానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకోండి.
my ex. peer developed urban-rural mixing gated community for Sr. Citizens in B'lore - https://suvidha.co.in/index.html
వానప్రస్థ అనేది ప్రాపంచిక బాధ్యతల నుండి క్రమంగా వైదొలగే కాలం. ఒక వైపు, ఒకరి శరీరం బలహీనపడటం ప్రారంభించినప్పుడు మరియు మరోవైపు, యువ తరం కుటుంబ మరియు సామాజిక బాధ్యతలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు; గృహస్థాశ్రమము నుండి వానప్రస్థ ఆశ్రమము యొక్క తదుపరి దశకు గౌరవప్రదమైన మార్పు కొరకు తనను తాను సిద్ధం చేసుకోవాలి.
అని, ఇక మనం ఎలా ఎదుర్కోవాలి అంటే, కొన్ని:
- వీలైనంత వరకు మన (బంధువులు, అధ్యాపకులు) చుట్టు ఉన్న పెద్దలతో గడపడం & వారిని గౌరవించడం 😊🙏🏼 - Mekala V Reddy (11 Feb '24)

Story # 2:  కానుక   [ Please read alone when you find time ]
పూజ్యులైన అమ్మానాన్నలకు ప్రదీప్‌ నమస్కరించి వ్రాయునది. ఉభయకుశలోపరి. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం దొరికింది. నేనూ మీ కోడలూ ఇక్కడి ఉద్యోగాలకు రాజీనామా చేశాం. ఈ నెలాఖరులోగా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాం. మిగిలిన వివరాలు వచ్చాక మాట్లాడుకుందాం. 
ఇట్లు ....మీ కుమారుడు ..ప్రదీప్‌

క్లుప్తంగా ఉన్న ఆ ఉత్తరం చదివిన సీతారామయ్య, వైదేహీల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆరు అంకెల జీతంలో ఉన్న కొడుకూ అయిదంకెల జీతంలో ఉన్న కోడలూ ఉద్యోగాలకు రిజైన్‌ చేసి ఇండియాకి తిరిగి వచ్చేయడమేమిటీ..? ఇక్కడ... ఈ హైదరాబాద్‌లో అంత జీతం ఎక్కడుందీ? ఎవరిస్తారూ? అయినా చుట్టపుచూపుగా ఇండియాకి రావడమేగానీ, తాము అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోతామని ప్రదీప్‌ కచ్చితంగా తన నిర్ణయాన్ని ఏనాడో చెప్పేశాడుగా! మరి ఈ ఉత్తరం ఏమిటీ? వాడు పనిచేసేచోట ఏమన్నా గొడవలు జరిగాయా? భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చాయా? సందేహాల సునామీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా వృద్ధ దంపతులు.

‘‘ఏమిటండీ ఇది?’’ భర్తని అడిగింది వైదేహి.

‘‘ఉత్తరం’’ సింపుల్‌గా అన్నాడు సీతారామయ్య. భర్త జవాబుతో తెల్లబోయిన వైదేహి మొహంచూసి చిన్నగా నవ్వి ‘‘నాకొకటి తెలిస్తేగా నీకు చెప్పడానికి’’ అన్నాడు.

ఉత్తరం వచ్చినప్పటి నుంచి అన్య మనస్కంగానే గడిపారా ఇద్దరు. సాయంకాలం వాలుకుర్చీలో నడుంవాల్చి అదే ఆలోచనల్లో ఉన్న సీతారామయ్యకి చటుక్కున సందేహం కలిగింది. ఒకవేళ ప్రదీప్‌ తానిచ్చినదాన్ని చూశాడా? దానిని ఎప్పుడు చూడాలో తాను స్పష్టంగా చెప్పాడుగా? ఒకవేళ చూసినా, వీడు ఇండియాకి తిరిగి వచ్చేయడానికీ దానికీ ఏమన్నా సంబంధం ఉందా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాడాయన. దానిని ప్రదీప్‌కి అందజేసిన రోజు జ్ఞాపకం వచ్చిందాయనకు. ఆరోజు...

రెండేళ్ళక్రితం తల్లిదండ్రులను చూడటానికి కాలిఫోర్నియా నుండి భార్యా పిల్లలతో వచ్చాడు ప్రదీప్‌. నెలరోజులు సరదాగా గడిచిపోయాయి. మరుసటిరోజే తిరుగుప్రయాణం. వైదేహి కోడలినీ పిల్లలనూ తీసుకుని తెలిసినవారింటికి వెళ్ళింది. ఇంట్లో తండ్రీకొడుకులు మాత్రమే ఉన్నారు.

‘‘బాబూ... దీపూ!’’ గదిలో బ్యాగ్‌ సర్దుకుంటున్న ప్రదీప్‌ తలెత్తిచూశాడు. ఎదురుగా తండ్రి.

‘‘ఏమిటి నాన్నగారూ’’ అన్నాడు ప్రదీప్‌.

తన చేతిలోని ఒక ప్యాకెట్‌ కొడుకుకి అందిస్తూ ‘‘ఇది నీ దగ్గర భద్రంగా ఉంచు’’ అన్నాడు సీతారామయ్య.

‘‘ఏమిటిది?’’ ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్‌.

‘‘అది ఇప్పుడు చెప్పను. దీన్ని నేనూ మీ అమ్మా మరణించిన తర్వాతే తెరిచి చూడాలి. మరణించిన వెంటనే చూడాలని రూలేం లేదు. ‘మేము లేము’ అని తెలిసిన తర్వాత మాత్రమే ఎప్పుడన్నా చూడాలని అనిపిస్తే చూడు. అప్పటివరకూ దీన్ని ఓపెన్‌ చేయకు’’ అన్నాడు సీతారామయ్య. కొడుకు మరోమాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలోనుండి ఇవతలకి వచ్చేశాడు.

కొడుకు ‘ఆ ప్యాకెట్‌నుగాని తెరిచి చూశాడా?’ అన్న సందేహమే ఇప్పుడు సీతారామయ్యకి వచ్చింది. ఆయనకి వచ్చిన సందేహం యధార్థమే... జరిగింది అదే.

ప్రదీప్‌ని గత కొద్దికాలంనుండి ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతోంది. స్వంత ఇల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలన్స్‌... జీవితంలో కోరుకున్నవి అన్నీ సాధించినా, వాటి తాలూకు ఆనందం మనసుని తాకడంలేదు. ఇవేవీకావు, ఇంకా... ఇంకా... ఏదో కావాలని ఆరాటం... ఏమిటది? ఏసీ గదిలో భార్యాపిల్లలు ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నా, తనకిమాత్రం కంటిమీద కునుకురాక నిద్రలేమితో బాధపడేవాడు. దాని ప్రభావం ఉద్యోగంమీద పడుతోంది. అసలు తన అసంతృప్తికి కారణం ఏమిటో తెలిస్తే కదా, పరిష్కారం గురించి ఆలోచించడానికి.

చిన్నప్పటినుండి ప్రదీప్‌ చదువులో ఫస్ట్‌. ఇంటర్‌లో ర్యాంక్‌ వచ్చాక తనకిష్టమైన కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేయాలని ఎంతో ఉబలాటపడ్డాడు. స్కూల్‌ టీచరైన తండ్రి తనకంత శక్తిలేదంటే అతి కష్టంమీద ఒప్పించి, తరతరాలనుండి వస్తున్న ఇంటిని తనఖా పెట్టించి ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాడు. అన్ని సరదాలు చంపుకుని పుస్తకాలకే అంకితమైపోయాడు. ఇంజినీరింగ్‌లో కూడా ర్యాంక్‌ రావడం... అతడి మరో చిరకాలవాంఛ- అమెరికాలో ఉద్యోగం... అన్నీ చకచకా జరిగిపోయాయి.

తనఖా పెట్టించిన ఇంటిని విడిపించి, తన చదువుకోసం చేసిన అప్పులన్నీ తీర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి మంచి పొజిషన్‌లోకి వచ్చాడు. ఆరంకెల జీతాన్ని తొలిసారిగా అందుకున్నప్పుడు ఎవరెస్ట్‌ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినంత ఫీలింగ్‌... తనని ప్రాణాధికంగా ప్రేమించే భార్య మంజుల... ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు- రమ్య, సిద్ధార్థ... భార్యాభర్తలిద్దరి ఆర్జన... ‘జీవితంలో అనుకున్నవన్నీ సాధించాను. నాకింక లోటేమీలేదు’ అని భావించిన ప్రదీప్‌లో అసంతృప్తి అదృశ్యరూపంలో వెన్నాడటం మొదలయింది...

ఆరోజు... ఇండియా నుండి వచ్చిన ఇరవైరెండు నెలల తరవాత... అర్ధరాత్రి పన్నెండయ్యింది.

ఎప్పటిలాగానే నిద్రపట్టక బెడ్‌రూంలో పచార్లు చేస్తున్నాడు. భార్యాపిల్లలు ప్రశాంతంగా నిద్ర పోతున్నారు. బెడ్‌రూం నుండి రీడింగ్‌రూమ్‌లోకి వచ్చాడు. కాసేపు ఏదైనా మంచి సంగీతం విని రిలాక్సవుదామని క్యాసెట్‌ కోసం షెల్ఫ్‌ దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఇండియా నుండి తీసుకువచ్చిన గజల్‌ శ్రీనివాస్‌ పాటల క్యాసెట్‌ కన్పించింది. ఆ క్యాసెట్‌ తీస్తుండగా, షెల్ఫ్‌లో కన్పించింది తండ్రిచ్చిన ప్యాకెట్‌.

ఇండియా నుండి వచ్చిన తరవాత ఒకటి రెండుసార్లు ‘ఆ ప్యాకెట్‌ ఓపెన్‌చేసి చూద్దామా?’ అని అనిపించింది. కానీ తండ్రిమీద గౌరవంతో ఆ పని చేయలేక షెల్ఫ్‌లో అలా పడేశాడు. ఇప్పుడు తిరిగి కనబడేసరికి మళ్ళీ కుతూహలం మొదలయింది. ప్యాకెట్‌ చేతిలోకి తీసుకున్నాడు. ‘ఒక్కసారి తీసిచూస్తే’ అన్పించింది. కానీ తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం రావడంతో ‘భావ్యం కాదు’ అనుకుని తిరిగి షెల్ఫ్‌లో పెట్టేయబోయి ఆగాడు. ‘తప్పేంటీ? ఎప్పటికైనా చూడమనేగా తండ్రి తనకిచ్చింది. చెప్పినదానికన్నా కొద్దిగా ముందు చూస్తున్నాడు... అంతేగా’ మనసుకి సంజాయిషీ ఇచ్చుకోవడానికి ప్రయత్నించాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. చివరికి అతనిలోని కుతూహలమే జయించింది.

‘నాన్నగారూ! మీ మాటను ఉల్లంఘిస్తున్నందుకు క్షమించండి’ అని మనసులోనే అనుకుని సీల్‌ చేసిన ఆ ప్యాకెట్‌ని ఓపెన్‌ చేశాడు. ‘తండ్రి అంతగా చెప్పాడంటే అందులో ఏదో విశేషమే ఉంటుంది’ అనుకుని ఆశపడ్డ ప్రదీప్‌కి తీవ్ర ఆశాభంగమే ఎదురైంది. ప్యాకెట్‌లో రెండు సీడీలూ ఒక లెటరూ ఉన్నాయి. అంతే... నిర్లిప్తత ఆవరించిన ప్రదీప్‌ అన్యమనస్కంగానే ఉత్తరం అందుకుని చదవసాగాడు.

‘‘బాబూ, దీపూ! మీ అందరికీ మా ఇద్దరి ఆశీస్సులు. ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి నేనూ అమ్మా ఈ లోకంలో ఉండమని మాకు తెలుసు. మృత్యువు తాను వచ్చేముందు ఎటువంటి హెచ్చరికలూ చేయకుండా సడెన్‌గా వచ్చేయవచ్చు. మా మరణవార్త తెలిసిన తరవాత నువ్వెంత ఆఘమేఘాల మీద పరిగెత్తుకు రావాలనుకున్నా, ఆఫీసులో సెలవు దొరికి, ఫ్లైట్‌లో సీటు దొరికి ఇక్కడికి వచ్చేసరికి మా చితాభస్మమే తప్ప, మా భౌతికకాయాలను ఆఖరిసారిగా చూసే అవకాశం కూడా నీకు లేకపోవచ్చు. మరణించేముందు ప్రతీ తల్లికీ తండ్రికీ తమ సంతానానికి ఏదో చెప్పాలని తాపత్రయం... ఉబలాటం. దానికి మేం కూడా అతీతులేంకాదు. కానీ ఆ అవకాశం మాకులేదు. ఎలా..? ఒకసారి టీవీలో ‘మాయాబజార్‌’ సినిమా చూస్తున్నా. ఎప్పుడో యాభై ఏళ్ళనాటి సినిమా. అందులో నటించిన యస్వీఆర్‌, యన్టీఆర్‌, సావిత్రి, రేలంగి... వీళ్ళల్లో ఎవ్వరూ ఈనాడు లేరు. అయినా వారి నటనాకౌశలాన్ని ఈనాడు మనం చూడగలుగుతున్నాం. ఆనాటి ఘంటసాల గానం ఈనాటికీ మన గుండెలోతులను స్పృశిస్తోంది. దీన్ని గురించే ఆలోచిస్తుంటే హఠాత్తుగా ఒక ఆలోచన స్ఫురించింది. మనం మరణించాక మన పిల్లలు మనల్ని చూడాలనుకుంటే ఫొటోలే ఆధారం. లేదా వాళ్ళ పెళ్ళి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకు ‘అదిగోరా మీ తాతయ్య... అదిగో మీ నాన్నమ్మ...’ అని చూపిస్తారు. అంతేగా! కానీ మా కంఠస్వరాలు వినలేరు కదా! ఎప్పుడో ఏళ్ళనాటి సినిమా ఇప్పుడు కూడా చూడగలుగుతున్నప్పుడు, వాళ్ళ మాటలూ పాటలూ వినగలుగుతున్నప్పుడు, మరణించిన తల్లిదండ్రుల మాటలు మాత్రం ఎందుకు వినలేం?

నా సమస్యకి పరిష్కారం లభించింది. దాని ఫలితమే ఈ సీడీలు. మేము లేకపోయినా మా రూపం, మా మాట నీముందుంటుంది. అమ్మానాన్నలను చూడాలని ఉందా? మరి ఆలస్యం దేనికీ? సీడీలు చూడూ...
ఇట్లు
నీ నాన్న’’

విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రదీప్‌ ఉత్తరాన్ని మడిచి, ‘అమ్మ’ అని లేబుల్‌ అంటించిన సీడీ తీసి, డి.వి.డి.ప్లేయర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు.

తలలో పూలు, నుదుట రూపాయి కాసంత బొట్టు, పట్టుచీర, చేతులనిండా గాజులు... మూర్తీభవించిన ముత్తైదువ రూపంలో చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ అమ్మ...

‘బాబూ, దీపూ... మీ నాన్నగారు- అబ్బాయితో ఏమన్నా మాట్లాడు’ అన్నారు. ‘ఏం మాట్లాడనురా కన్నా? దీపూకి నా మాటకంటే పాటే ఇష్టం. నా పాటే వినిపిస్తాను’ అన్నాను. ‘మరి నా పాట వింటావా?’ వైదేహి అడుగుతోంది ప్రదీప్‌ని.

అవును... అమ్మ అద్భుతంగా పాడుతుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. రేడియో ఆర్టిస్ట్‌ కూడానూ. తను అమ్మ దగ్గరేగా సంగీతం నేర్చుకుంది? అమ్మంత గొప్పగా కాకపోయినా, తనుకూడా బాగానే పాడగలడు. స్కూలు, కాలేజీ, యూనివర్శిటీ... పాటల పోటీలలో ఎప్పుడూ ప్రథమస్థానం తనదే. దానికి కారణం అమ్మపెట్టిన సంగీత భిక్ష. ఇప్పుడీ యాంత్రిక జీవితంలో పడిన తరవాత తనకి సా...పా...సా వచ్చునన్న సంగతే మర్చిపోయాడు. ఆలోచనలనుండి తేరుకుని స్క్రీన్‌ వంక చూశాడు.

పూజా మందిరంలో దేవుని ముందు కూర్చుని వైదేహి ‘ఎందరో మహానుభావులు’ కీర్తన ఆలపిస్తోంది. తరవాత ‘నగుమోము కనలేని’ కీర్తన... అలా వరసగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి కీర్తనలు... హాలులో నటరాజ విగ్రహం ముందు కూర్చుని తంబుర మీటుతూ ‘కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ’ అంటూ అన్నమయ్య కీర్తనతో మొదలుపెట్టి, రామదాసు, పురందరదాసు కీర్తనలు... పెరట్లో పూలమొక్కల మధ్య విహరిస్తూ శ్రీరంగం గోపాలరత్నం పాడిన ‘అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ’ వంటి

లలితగీతాలు పాడుతూ...

సంగీతామృత జలపాతంలో నిలువెల్లా తడిసిముద్దయిపోతూ ఉక్కిరిబిక్కిరైపోతున్న ప్రదీప్‌కి వూపిరి

పీల్చడమే కష్టమైపోతోంది. హృదయంలో ఏవేవో ప్రకంపనలు... అమ్మ పాడుతున్న ఆ పాటలన్నీ తనకీ వచ్చు... అమ్మేగా నేర్పిందీ..? పసితనంలో ఒళ్ళొ కూర్చోబెట్టుకుని మాతృమూర్తిలా... ఎదిగిన తరవాత ఒక గురువులా ఎన్ని పాటలు నేర్పిందీ? ఏవీ ఆ పాటలూ... ఏవీ ఆ మధురానుభూతులూ..? సీడీ పూర్తయ్యేసరికి మనసులో తీవ్రమైన సంఘర్షణ... స్నానం చేసినట్టు స్వేదంతో శరీరమంతా తడిసిపోయింది. వణుకుతున్న చేతులతో ‘నాన్న’ అన్న లేబిల్‌ అంటించి ఉన్న రెండో సీడీని ప్లేయర్‌లోపెట్టి ఆన్‌ చేశాడు. మల్లెపూవులాంటి పంచె, లాల్చీ ధరించిన సీతారామయ్య చిరునవ్వులు చిందిస్తూ కుర్చీలో కూర్చుని ఉన్నాడు.

‘‘దీపూ... బాగున్నావురా బాబూ? ‘నాన్న ఏం చెబుతారులే- ధర్మపన్నాలూ నీతిబోధలూ చేసి ఉంటారు’ అనుకుంటున్నావు కదూ. అవన్నీ చెప్పడానికి నేనెవరినిరా? ఎవరి వ్యక్తిగత జీవితాలు వారిష్టం. అవతలివారు కోరుకున్నట్లు తానుండలేని మనిషి, ఎదుటివారు మాత్రం తాను కోరుకున్నట్లు ఉండాలనుకోవడం అజ్ఞానం కాక మరేమిటి? అయినా ఇంత వయసు వచ్చిన నీకు మరొకరి సందేశాలూ హితబోధలూ అవసరమా? మరి నీకు ఏం చెప్పాలి? ఆ... లోకంలో సంపదనంతా గుమ్మరించినా కాలచక్రంలో ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తిప్పలేరన్న సంగతి నీకు తెలియంది కాదు. అవునా? అందుకే నిరుపయోగమైన సందేశాలకంటే మధురమైన నీ బాల్యస్మృతులు ఒక్కసారి నీకు జ్ఞప్తికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మాతో కలిసి పంచుకున్న ఆ అనుభూతులు నీ కళ్ళముందే కదలాడుతుంటే నీ స్మృతిపథంలో మేం కనీసం ఆ కొన్ని క్షణాలైనా తిరిగి సజీవులౌతామేమోనన్న చిన్న ఆశ. దీపూ... నీకు గుర్తుందా..?’’ అంటూ సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి సంగతులు ఒక్కొక్కటీ చెప్పనారంభించాడు...

పదినెలల వయసులో అతి కష్టంమీద లేచినిలబడి అడుగులు వేయడం... తండ్రి ‘ఒకటి, రెండు, మూడు’ అంటూ లెక్కపెట్టడం... నాలుగు అడుగులువేసి పడిపోతే తల్లి కంగారుగా ఎత్తుకోబోతూ ఉంటే, తండ్రి వారించడం... అల్మారాలో ఉంచిన అటుకుల డబ్బాకోసం తల్లి చూడకుండా కుర్చీని కష్టంమీద లాక్కొచ్చి డబ్బా అందుకోబోతే, మూతలేని డబ్బా జారి అటుకులు మొత్తం నెత్తిమీదగా తలంబ్రాల్లా పడటం... తండ్రి మెడచుట్టూ చేతులువేసి ఉప్పుమూటలా వూగుతూ- వేమన, సుమతీ శతకాలలోని పద్యాలు నేర్చుకోవడం... ఇంటిపని చేసుకుంటూ తల్లి పాడుతూ ఉంటే, వచ్చీరాని మాటలతో వంతపాడాలని ప్రయత్నించడం... రెండోక్లాస్‌ చదువుతున్నప్పుడు రోడ్డుమీద దొరికిన రోల్డ్‌గోల్డ్‌ గుళ్ళగొలుసులో ఒక పూస పట్టుకొచ్చి ‘అమ్మా! నీకోసం బంగారం పట్టుకొచ్చా’ అంటే, తల్లిదండ్రులు పగలబడి నవ్వడం... అదిచూసి బుంగమూతి పెట్టుకుని ‘పో అమ్మా, నీకోసం ఎంతో కష్టపడి తెస్తేనూ...’ అంటున్న ప్రదీప్‌ అమాయకత్వానికి తల్లి అక్కున

చేర్చుకుని ముద్దాడటం... తండ్రి ఒళ్ళొ కూర్చోబెట్టుకుని ‘ల, ళ, ర, ఱ, శ, ష, స’ అక్షరాలు స్పష్టంగా పలికే విధానం నేర్పించడం... నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో చెయ్యి విరక్కొట్టుకుంటే, ‘అసలే డబ్బుకి ఇబ్బందిగా ఉందనుకుంటే, మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఖర్చు; నాన్న ఎక్కడ్నించి తెస్తారు?’ అని తల్లి మందలిస్తే, ప్రదీప్‌ చిన్నబుచ్చుకున్న మొహంతో తండ్రి దగ్గరకొచ్చి ‘నాన్నా, అమృతాంజనం రాసుకుని కాపడం పెట్టుకుంటా, అదే తగ్గిపోతుంది. డాక్టరు దగ్గరికి వద్దు’ అని అంటే- తండ్రి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగి

ప్రదీప్‌ని దగ్గరకు తీసుకోవడం... రేపు సెవెన్త్‌క్లాస్‌ పబ్లిక్‌ పరీక్షలనగా, వీధిలో పిల్లలు ఆడుకుంటున్న క్రికెట్‌ ఆటని ప్రదీప్‌ చూస్తుండగా, క్రికెట్‌బంతి వచ్చి ప్రదీప్‌ మోకాలిచిప్పకు బలంగా తగిలి, మోకాలు బత్తాయిపండు సైజులో వాచిపోతే, పరీక్షకి వెళ్ళలేనేమోనని ప్రదీప్‌ ఏడుస్తుంటే, తండ్రి రిక్షాలో స్కూల్‌కి తీసుకెళ్ళి, అక్కడినుండి పరీక్ష రాసేగదికి రెండు చేతులతో ఎత్తుకెళ్ళి పరీక్ష రాయించడం...

ఇలా ఒకటేమిటి, సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి సంఘటనలు ఒక్కొక్కటీ వివరించి చెబుతూ ఉంటే, ఒక్కొక్క సంఘటనా, ఒక్కొక్క మిస్సైల్‌లా ప్రదీప్‌ గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. సీడీ పూర్తయ్యేసరికి ప్రదీప్‌ ఒక కంటినుండి నయాగరా, మరో కంటినుండి శివసముద్రం జలపాతాలు. కంట్రోలు చేసుకోవడం అతని శక్తికి మించిన పనే అయింది.

ఏమిటా కన్నీళ్ళకి అర్థం? వేదనాభరితమైన హృదయం కార్చిన కన్నీరా? సీడీ మొత్తంలో

తండ్రి ఎక్కడా కూడా ప్రదీప్‌ని మందలించలేదు... విమర్శించలేదు... హితబోధలు చేయలేదు.

మరి ఎందుకీ కన్నీరు? అవి... ఆనందబాష్పాలా? కాదు... యాంత్రికజీవనం, కృత్రిమత్వంతో హృదయంలో నిర్మించిన ఆనకట్ట, మానవ అనుబంధాలనే వరదతాకిడికి బద్దలై, అనురాగం, అభిమానం,

ఆత్మీయతా ఆప్యాయతా వంటి కెరటాలు ఉవ్వెత్తున ఎగసి గుక్కతిప్పుకోనివ్వకుండా, వూపిరందకుండా చేస్తున్నప్పుడు కలిగే భావన అది. అక్షరాలకు అందని అనుభూతి అది.

అలా ఎంతసేపు వెక్కివెక్కి ఏడ్చాడో ప్రదీప్‌... చాలాసేపైన తరవాత, కొద్దిగా తేరుకుని, మనసు కంట్రోల్‌ చేసుకోవడానికి ‘గజల్‌ శ్రీనివాస్‌’ పాటల క్యాసెట్‌ టేప్‌రికార్డర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు.

‘‘ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్‌

నా సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయ్‌...’’

టేప్‌లో గజల్‌ శ్రీనివాస్‌ గొంతు మధురంగా విన్పిస్తోంది. ‘ఎంత కోఇన్సిడెన్స్‌... నాన్న చెప్పిన బాల్యం సారాంశం ఒక్క పాటలో కళ్ళముందుంచాడు... పాదాభివందనం శ్రీనివాస్‌’ అనుకుంటున్న ప్రదీప్‌ మెదడులో తటిల్లంటూ మెరిసింది ఒక పెద్దమెరుపు. తనని ఇంతకాలం పీడిస్తున్న అసంతృప్తికి మూలమేమిటో తెలిసింది.

మానవ సంబంధాల లేమితో తను బాధపడుతున్నాడు... యస్‌... కమ్యూనికేషన్‌ గ్యాప్‌...

ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టూ ఎవరో భయంకరమైన వేటకత్తి తీసుకుని చంపడానికి వస్తున్నట్టూ ఉరుకులు

పరుగులు... కేర్‌టేకర్‌కి పిల్లల్ని అప్పగించి తనో దిక్కుకూ తన భార్యో దిక్కుకూ మారథాన్‌ రన్నింగ్‌. అలసిన శరీరాలతో ఏ రాత్రికో ఇల్లు చేరటం, ఏదో తిన్నామన్న పేరుకి అన్నం మెతుకులు కతికి, ఎప్పుడు పక్కమీదకు చేరి విశ్రాంతి తీసుకుందామా అన్న ఆరాటం... మొక్కుబడి పలకరింపులు...

అతికించుకున్న ప్లాస్టిక్‌ చిరునవ్వులు... తమ ధనవ్యామోహాన్ని కప్పిపుచ్చుకుంటూ ‘ఇదంతా సంతానం ఉజ్వల భవిష్యత్‌ కోసమే’నంటూ ఆత్మవంచన స్టేట్‌మెంట్స్‌... వీకెండ్‌కి అందరూ కలసి ఎక్కడికన్నా వెళ్తే, ఈ ఆరురోజులు కలిసిలేమన్న బాకీ తీరిపోయినట్లు కృత్రిమ ఆత్మసంతృప్తి... తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్యగానీ భార్యాభర్తల మధ్యగానీ కరువైపోయిన ఆప్యాయతా ఆత్మీయతా.

తన అసంతృప్తికి కారణం తెలిసిన తరవాత ప్రదీప్‌కి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ‘ఏ తల్లీతండ్రీ ఇస్తారు తమ సంతానానికి ఇంతటి అపురూపమైన కానుక... పరుషంగా ఒక్కమాట కూడా అనకుండా తాను జీవితంలో కోల్పోతున్నదేమిటో తన తండ్రి ఎంత తెలివిగా చెప్పాడు’ అనుకున్నాడు. సమస్యేమిటో తెలిశాక పరిష్కారం కనుక్కోవడం పెద్ద కష్టమేమీకాలేదు.

అప్పటికే తెల్లవారిపోయింది. భార్య లేచిన తరవాత ‘‘నేనివ్వాళ ఆఫీసుకి సెలవు పెట్టేస్తున్నాను. నువ్వూ సెలవు పెట్టేయ్‌’’ అన్నాడు.

‘‘ఎందుకూ?’’ ఆశ్చర్యంగా అడిగింది మంజుల.

‘‘చెబుతాగా’’ అన్నాడేగానీ వివరాలు చెప్పలేదు. స్నానం, టిఫిన్‌ కానిచ్చి, కొలీగ్‌కి తన సెలవు గురించి చెప్పి, తండ్రిచ్చిన సీడీలూ ఉత్తరం భార్య చేతిలోపెట్టి తాను మంచమెక్కాడు ప్రదీప్‌. పడుకున్న వెంటనే పట్టేసింది నిద్ర. చాలాకాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు లేచాడు. భార్యవంక చూశాడు. మంజుల మొహం బాగా ఏడ్చినట్లు ఉబ్బి కళ్ళు
ఎర్రబారి ఉన్నాయి.

‘‘మనం... మనం... ఇండియా వెళ్ళిపోదామండీ!’’ భోజనం చేస్తున్న ప్రదీప్‌ మీద చెయ్యివేసి అంది మంజుల. తన నిర్ణయాన్ని చెప్పేముందు భార్యని మానసికంగా సిద్ధంచేయాలన్న తలంపుతో, సీడీలు చూడమని చెప్పిన ప్రదీప్‌, తన నిర్ణయమే భార్య నోటివెంట వెలువడేసరికి ఆశ్చర్యంతో తలమునకలవుతూ తలాడించాడు. సీడీలోని పాత్రలూ సంఘటనలూ వేరుకావచ్చు... కానీ అనుభూతి ఒక్కటేగా!

‘‘ఇండియా వెళ్ళిన తరవాత నేను నా పిల్లలకి తల్లిగా, నా భర్తకు భార్యగా ఉండదలచుకున్నాను. ఏటియం మిషన్‌లా కాదు. అందుకే ఉద్యోగం చేయదలచుకోలేదు’’ అంది మంజుల భర్తని ఇంకా ఆశ్చర్యపరుస్తూ.

ఫారిన్‌లో జాబ్‌ చేస్తున్న ప్రదీప్‌కి ఇండియాలో జాబ్‌ రావడం కష్టంకాలేదు. జీతం అక్కడకంటే తక్కువే అయినా భార్యాభర్తలకది బాధ
అనిపించలేదు.

ఇండియా వచ్చాక హైదరాబాద్‌లోనే ఆఫీసుకి దగ్గర్లో ఫ్లాట్‌ తీసుకోవాలనిపించినా, మళ్ళీ వద్దులే అనుకుని, దూరమైనా తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా తమ స్వంత ఇంటినే రీమోడల్‌ చేయించాడు.

ఆరోజు ఆఫీసులో వర్క్‌ త్వరగా పూర్తికావడంతో ప్రదీప్‌ ఇంటికి త్వరగా వచ్చేశాడు. అప్పుడు సాయంత్రం అయిదున్నర అవుతోంది.

అరుగుమీద వాలుకుర్చీలో పడుకున్న సీతారామయ్య పొట్టమీద కూర్చున్న రమ్య, తాతయ్య చెబుతున్న ‘అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను’ పద్యాన్ని వల్లెవేస్తోంది. ఆ దృశ్యాన్ని తన్మయత్వంతో చూస్తున్న కొడుకుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు సీతారామయ్య.

తన గదిలోకి వెళ్ళి డ్రెస్‌ మార్చుకుని హాల్‌లోకి వచ్చాడు ప్రదీప్‌. వంటగదిలో మంజుల ఉల్లిపాయ పకోడి చేస్తున్నట్లుంది. ఘుమఘుమల వాసన ముక్కుని అదరగొట్టేస్తుంది. హాలులో స్తంభానికి చేరగిలబడి వైదేహి కూర్చొనుంది. ఆమె ఒడిలో
తలపెట్టుకుని సిద్ధార్థ పడుకుని నాన్నమ్మ పాడుతున్న రామదాసుకీర్తన చెవులప్పగించి వింటున్నాడు.

‘‘ఇరవుగ నిసుకలోన బొరలిన యుడుతభక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయెరా’’

‘ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ గొంతులో శ్రావ్యత అలానే ఉంది’ అనుకుంటూ మెల్లిగావచ్చి తల్లి ఒడిలో రెండోవైపు తలపెట్టి పడుకున్నాడు. పాలసంద్రమైపోయింది మనసు. ఎంత హాయి అమ్మ ఒడి... ఈ సంతృప్తిముందు తాను అమెరికాలో తొలిసారిగా ఆరంకెల జీతం అందుకున్నప్పటి తృప్తి మేరుపర్వతం ముందు ఇసుక రేణువులా అన్పించింది. ఆ ఆనందంలో అప్రయత్నంగా తల్లి గొంతుతో శృతి కలిపాడు.
‘‘ఎంతో వేడిన నీకు సుంతైన దయరాదు
పంతంబుసేయ నేనెంతటి వాడను తండ్రీ..పలుకే బంగారమాయెరా!’’

భర్తకి ప్లేట్‌లో పకోడీలు పట్టుకొచ్చిన మంజుల అక్కడి దృశ్యం చూసి అలాగే నిలబడిపోయింది. 

Disclaimer: Most of us face similar situation whether we are out side India / out side native. Give a try to spare some of your life/time with your family (parents, siblings & village). It's purely my view & not to suggest / force any !!
-------------------------------------------------***------------------------------------------------
ఒక్కసారి ఆలోచించండి  60 సంవత్సరాలు దాటిన మిత్రులారా...భవిష్యత్ లో జంటగా నైన❗️ ఒంటరిగా అయిన❗️ సామూహికంగా అయిన❗️ఆనందంగా ఆఖరి మజిలీ ముగియాలి ❗️ ఆయాసం  లేకుండా, అవస్థ పడకుండా❗️  అయిన వారి ఆదరణ తగ్గ కుండ ❗️భగవంతు నిలో ఐక్యం కావాలి💐ఎలా❗️ ఏమి చేయాలి❗️ 
💐చాలా మంది వృద్ధాప్యంలో  జరగబోయే పచ్చి నిజాలు.---//-

నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటే , గగనం నిండా ఎన్నో నక్షత్రాలు , క్రమక్రమంగా ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి...

నీ తోటి వయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు...

నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా నాయనమ్మలూ, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు...

నీ భాగస్వామి కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు...

బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు...

నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు....

నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. ఈ సొసైటీ   నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది...

దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి కావుమని అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది...

అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది...

పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు...

నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు...

ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ఏదో వ్యాధి అని చెప్పటం మొదలైనవి అన్నీ జీవితంలో భాగమైపోతాయి...

నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా,   చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో   నీవాళ్ళు చర్చిస్తూ ఉంటారు...
 
ఇవి వినడానికి చేదుగా ఉన్నా, పచ్చి నిజాలు...ఇలా ఎందుకు జరుగుతుంది... అంటే ఇక నీ అవసరం తీరింది కాబట్టి....నీ అవసరం ఇక వుండదు కాబట్టి..

ఇక్కడ తరిగింది కృతజ్ఞత , ప్రేమ , అభిమానం... పెరిగింది కృతఘ్నత , నిర్లజ్జ , అమానుషం ...

ఇవి చదవటానికి, వినటానికి చిత్రంగా ఉన్నా, చాలామంది జీవితాల్లో జరగబోయే పచ్చి నిజాలు.---//- 🙏

 మీ వీధిలో, మీ కాలనీలో, మీ గ్రామంలో వున్న మీకు తెలిసిన పెద్దవారిదగ్గరకు తరచుగా వెళ్తూండండి. వారి మాటలు విసుగులేకుండా వినండి. వారికి మీ ప్రేమను పంచండి. వీలైతే చిన్నచిన్న సహాయాలు చేయండి.

వృద్ధోపసేవ అని భారతంలో బాగా శ్లాఘించబడిన ధర్మం ఇది. వృద్ధోపసేవ వలన మనిషి బుద్ధిమంతుడవుతాడు.🙏🙏
------------------------------------------------***------------------------------------------------
📍    యవ్వనం & ముసలితనం               ➖➖➖✍️📍


#నేను యవ్వనంలో ఉన్నప్పుడు "మొటిమల్ని" గురించి బాధపడే వాడిని.
#నాకు ముసలితనం వచ్చినప్పుడు  “ముడతల్ని”  గురించి బాధపడుతున్నాను.

#నేను యవ్వనంలో ఉన్నప్పుడు “ఆమె” చెయ్యి పట్టుకోవాలని ఎదురుచూసే వాడిని.
#నాకు ముసలితనం వచ్చినప్పుడు ‘ఎవరైనా వచ్చి “నా చేయి”  పట్టుకుంటారా!’  అని ఎదురు చూస్తున్నాను.

#నేను యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను “ఒంటరిగా” వదిలేస్తే బాగుండును అనుకునేవాణ్ణి.
#నాకు ముసలితనం వచ్చినప్పుడు అందరూ నన్ను “ఒంటరిగా” వదిలేసారే అని బాధపడుతున్నాను.

#నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే “చికాకు” పడేవాడిని.
#నాకు ముసలితనం వచ్చినప్పుడు నాతో ఎవరూ కనీసం “మాట్లాడటం” లేదే అని బాధపడుతున్నాను.

#నేను యవ్వనంలో ఉన్నప్పుడు “అందాన్ని” ఆస్వాదించే వాడిని.
#నాకు ముసలితనం వచ్చినప్పుడు  నా చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ “అందాన్ని” చూసుకుంటున్నాను.

#నేను యవ్వనంలో ఉన్నప్పుడు నాకు “చావే” లేదు అనుకునే వాడిని.
#నాకు ముసలితనం వచ్చినప్పుడు... “రోజులు దగ్గర పడ్డాయి” అని బాధపడుతున్నాను.

#నేను యవ్వనంలో ఉన్నప్పుడు “ప్రతి క్షణాన్ని” పండగ చేసుకునే వాడిని.
#నాకు ముసలితనం వచ్చినప్పుడు “తీపి జ్ఞాపకాల్ని”  నెమరు వేసుకుంటున్నాను.

#నేను యవ్వనంలో ఉన్నప్పుడు “నిద్రలేవడం” కష్టంగా ఉండేది.
#నాకు ముసలితనం వచ్చినప్పుడు “నిద్రపట్టడం” కష్టంగా ఉంది.

#నేను యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా నా “గుండెల మీద” పిడిగుద్దులతో  గుద్దుకునే వాడిని.
#నాకు ముసలితనం వచ్చినప్పుడు 
ఈ “గుండె ఎప్పుడు ఆగి పోతుందో”  అని భయపడుతున్నాను.


❄️జీవితంలో రకరకాల "ఆటు పోట్లు" వస్తుంటాయి. 
🌦️దేనికీ భయపడ కూడదు. 

❄️ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం కావాలి.
 🌦️అదే నిజమైన “జీవితానుభవం!” 

అది “యవ్వనంలో” నైనా.. “ముసలితనంలో” నైనా.. అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా “ప్రశాంతంగా”  ఉంటుంది.✍️

Elderly saving money for their funeral !? surprising one..but saw many, in village too:
  1. Chengamma Tatireddy - Rs. 12,000/- in 1990's
  2. Siddamma Verempati - Rs. 20,000/- in 2010's
  3. Dharmayya Ebbili - Rs. 30,000/- in 2019

Comments

  1. Sir please kindly explain about yerlam/ erlam Reddy's dynasty and their glorious history

    ReplyDelete
    Replies
    1. Good question & will update when time permits...
      Or share it if possible pls :)

      Delete

Post a Comment

Popular posts from this blog

Reddy Dynasty

Hinduism