SivaReddy

Prof. Siva Reddy Gurivireddy ఆచార్య శివారెడ్డి 

Retired Chemistry Professor, Yogi Vemana University [రసాయన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు, యోగివేమన విశ్వవిద్యాలయం, కడప] working on social good in the area's of history (Vemana & Reddy rajulu), women empowerment, education and telugu language.
In 2011, Computer Center @ ReddySeva Samithi

Key Contributions to Society:
- వేమన తత్వాన్ని పరిశీలించి, పరిశోధించి వేమనను శూన్యవాదిగా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆచార్య జి. శివారెడ్డి - యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కే కృష్ణారెడ్డి అన్నారు (Oct 2024)

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
ఫురుషులందు ఫుణ్య పురుషులు వేరయ
విశ్వధాభిరామ, వినుర వేమ
ఆనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ, వినుర వేమ
గంగి గోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వధాభిరామ, వినుర వేమ

News paper updates:
-
2020: Arts & Crafts @ Reddy Seva Samithi

In Oct 2024:






 



Reddy Sangams:

For more, read the article: https://www.outlookindia.com/magazine/story/always-on-the-reddy/282339

-----------------------***----------------------
Vemana Padyalu:
 Kumaragiri Vema popularly known as Vemana was a great Telugu philosopher and poet. His poems were written in Telugu, and are known for their use of simple language and native idioms. His poems discuss the subjects of Yoga, wisdom and morality. Vemana is called Maha Yogi !!
click here to Read draft version of Vemana Vishvam
  • Lived in 17th Century. (Born 1662 according to CP Brown) in Cuddapah, A.P.
  • Wrote about 4000 verses of social value.
  • Poems written in Simple, straight forward language, like below:
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
ఫురుషులందు ఫుణ్య పురుషులు వేరయ
విశ్వధాభిరామ, వినుర వేమ
ఆనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ, వినుర వేమ
గంగి గోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వధాభిరామ, వినుర వేమ
Yogi Vemana is a 1947 Telugu film directed by Kadiri Venkata Reddy and starring Chittor V. Nagaiah.
Yogi Vemana is again made as Telugu film in 1988 directed by C. S. Rao and starring Vijayachander.
  Telugu is a language spoken by 100 million people in Andhra Pradesh & Other stages, India and other countries.

References:
  1. ReddySevaSamithi, Kadapa vari Vemana Padyalu
  2. CP Brown Academy, Vemana Satakamu
  3. You can listen Vemana Padyalu, from Reddy Seva Samithi site 
  4. Vemana Padyalu - http://youtu.be/9fxydzIw81E or (click here)
  5. Vamana Movie ....click here 
  6. Vemana Padyalu (telugu) Vol 1. - Vol 2
















































Another Perspective / story from Prof. G S Reddy: (Reply to below story- శ్రీ యోగి వేమన..!! )
It is known since long back that Katarupalli Vemana is not Yogi Vemana. Bandi Gopal Reddy and Rallapalli Ananthakrishna Sarma confirmed the same.
Now they themselves declared that his name is Pydipalli Pullareddy.
Pullareddy declared himself as Vemana.
There was no need for Vemana to declare himself as Vemana.
There is a Vaishnavite symbol on Vemana Samadhi in Katarupalli.
The People who come on horseback in Vemana uniform also wear Vaishnavite symbol.
They also declare:  ........ GOVINDA GOVINDA.
But there is not even a single poem on Vishnu in Vemana poems except two poems on Rama.
There are more than 20 poems on SHIVA shows he is mostly Shiva follower.
When APSTDC wanted to spend money there , I told them that it is not Vemana Samadhi,
But they told that there is no other memorial  and so they spending money.
Narla Venkateswara Rao, the famous writer has written a monograph to Sagitta Academy in which he mentioned that Yogi Vemana died in a cave near RAPUR of Nellore District.
Katarupalli people are canvassing/publicising for "Katarupalli Vemana" , not original Vemana.

శ్రీ యోగి వేమన..!!  (Received from friend - Vamsi, but need to confirm the truth) 

చాలా మందికి వేమన గురించి..
సిన్మావాళ్ళు ఎంత చూపించారో అంతే తెలుసు.....
కానీ వాస్తవం వేరు..

ఈయన అసలు  పెరు ""బెదమ కోమటి చిన వేమారెడ్డి""
ఈయన అన్న పేరు ""బెదమ కోమటి పెద వేమారెడ్డి""
అప్పటి కడప..కర్నూలు..అనంతపురం కలిపి ఒకే రాజ్యంగా ఉండేది...
దానికి సామంత రాజు బెదమకోమటి పెదవేమారెడ్డి గారు.
అతని మంత్రి ""తురగారాముడు.
తురగారాముడు ఎలాగైనా అన్నదమ్ములనిద్దరినీ చంపి
తాను రాజు కావాలని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు...

ఇప్పుడు మనం చినవేమారెడ్డిని  వేమన అని పిలిచుకుంటున్నాము....
ఇతడు మహా ధైర్యవంతుడు...
పేరుకు అన్నగారు రాజు..
కానీ మొత్తం రాజ్యం వేమన్న ధైర్యసాహసాలు కనుసన్నులో ఉంటుంది....
అతని ధీర్యానికి ఉదాహరణ...

ఒక మదపుటెద్దు ఊరి మీద పడి అందరినీ కుమ్ముతూ
హడలెత్తిస్తూ ఉంటుంది...
అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ వుంటారు...
ఎద్దుకు మదమెక్కితే దాన్ని ఆపడం  ఏ పహిల్వాన్ చేత కూడా కాదు....
అటుగా వస్తున్న వేమన మీదికి వెళుతుంది....
అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా దాని కళ్ళలోకి చూసి ""ఏయ్"'అని గద్ధిస్తాడు...
ఆ శబ్దం ఆ ఎద్దు చెవులనుంచి దూరి ఊరి మొత్తం ప్రతిధ్వనిస్తుంది.....
దాని కళ్ళకు వేమన మహా సింహం లాగా కనిపిస్తాడు.... హడలెత్తి తోకముడుచుకొని పారిపోతుంది....

దాన్ని ప్రత్యక్షంగా చూసిన తురగారాముడు ముందు
వేమన్నను మట్టు బెడితే గానీ తన పని సులువు కాదని,,,
వేమన ఉన్నంత వరకూ తానేమీ చేయలేనని తెలుసుకుంటాడు...
తన దృష్టిను వేమన మీద ఉంచుతాడు..

వేమనకు భోగగత్తెల ( ,వేశ్యల ) సాంగత్య ఎక్కువ..
ఎక్కడైనా కొత్తగా భోగసానిగా వృత్తిలోకి వచ్చింది అంటే
ఈయన ముందు వెళ్ళేవాడు....
వేమనకు ""విస్వద """అనే ఒక ప్రేయసి కూడా ఉంటుంది...
వేమన అంటే ఆమెకు చాలా ఇష్టం....
ఎన్నోసార్లు తన రాజ్యం గురించి,,,,తాను నిర్వర్థించాల్సిన ధర్మం గురించి అనేక సార్లు హెచ్చరిస్తుంది..
కానీ వేమన అవేమీ పట్టించుకునేవాడు కాదు....

మీరు శరీర అందం వెనుక పరిగెడుతున్నారు....
కానీ అది శాశ్వతమ్ కాదు....
అందం వెనుక అందవికారం కూడా దాగి ఉంటుంది...
యవ్వనంలో కనపడినట్లు ఈ శరీరం ముసలితనంలో
తన ప్రాభవం కోల్పోతుంది...
ఏదైతే ఇప్పుడుండి ఇక మీదట ఉండదో దాని కొరకు
మీరు పరిగెడుతున్నారు....
మీరు కాస్త ఆగి యోచించాలని హెచ్చరిస్తుంది....
కానీ వేమన పట్టించుకునే వాడు కాదు....
తురగారాముడి కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది...కానీ ఫలితం ఉండదు....

అప్పుడే దసరా తిరునాళ్ళు మొదలవుతాయి....
వెంపల్లి సంబరాలకు ముస్తాబవుతుంది....
ఆ తిరునాళ్ళలో మహా అందెగత్తె ""మాంచాల నాగులు భోగమాటను ప్రారంభిస్తుంది....
ఆమె గురించి ఆ నోటా,,,ఈ నోటా,,,వేమనకు చేరుతుంది...
వేమన ఒక సారి వెంపల్లెకు వెళ్లి చూస్తాడు.....
ఆమె అందానికి దాసుడై పోతాడు....

ఇక తన మకాం పూర్తీగా వెంపల్లె నాగుల యింటికి మారుస్తాడు....
ఓ ప్రేయసీ కంటే ఎక్కువగా అభిమానిస్తాడు.
నెలలు గడుస్తాయి.....
నెలల కొద్దీ ఇంటికి రాకపోయే సరికి అన్నకు వదినకు సందేహం కలుగుతుంది....
వేమన నాగుల అనే వేశ్య ఇంట్లో పరిమితమయ్యాడని తెలుసుకుంటారు..
డబ్బులన్నీ ఇలా ఆమెకు దారపొయ్యడం మంచిది కాదని,,,
రాజ్యం శిస్తులన్నీ వాడుకోవడం ధర్మ0 కాదని..
రాజ్యం పరిపాలన దెబ్బతింటుందని వదిన వారిస్తుంది....

""విస్వద" కు వేమన్న భవిష్యత్తు కళ్లముందర కనిపిస్తుంది..
అతని భవిష్యత్తు అంధకారమై పోతుందని గ్రహించి...
సత్యం చెప్పే తీరాలని నిర్ణయించి వేమన్నను పిలిచి..
తొందరలోనే మీరు మరణించబోతున్నారు...
శరీరానికి నెలలు కాదు రోజులు మాత్రమే ఉన్నాయి...
ఈ శరీరం దేనికోసం తీసుకున్నావో దానిని ఇక మీరు నిర్వర్థించలేరు..
ఇప్పటికైనా మేల్కొనండి....
జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి...
ఆ మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యండి అంటుంది...

వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు...
వేమన ""నాగుల"" కి పచ్చి బానిస అయ్యాడని గ్రహించిన
తురగారాముడు వెళ్లి నాగులను లోబర్చుకుంటాడు....
కొంత మంది సైన్యాన్ని కూడా లోబర్చుకుని ఉంటాడు...
సైన్యంతో నాగుల దగ్గరకు వెళ్లి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన మీదికి ప్రయోగం చేయవలసిందిగా చెబుతాడు....
దానికి గానూ ఆమెకు డబ్బు,,,జాగీరు ఎరగా చూపుతాడు....చెయ్యకపోతే తానే వేమన్నను చంపి ఆ అభియోగం నీమీదికి తీసుకొస్తానని బెదిరిస్తాడు....చేసేది లేక ఆమె ఒప్పుకుంటుంది....

ఒక అమావాస్య రోజు పాయసం చేసి భోగలాలసలో వున్నప్పుడు తాగమని ఇస్తుంది....
వేమన తన ప్రేయసి ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు....
అంతే పూర్తీగా దాదాపు శరీరాన్ని వదిలేసినంత కోమాలోకి వెళ్ళిపోతాడు..
నాగులు తురగారామునికి పని పూర్తీ అయిందని కబురు బెడుతుంది...
తురగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవులలో వేయించేస్తాడు....

ఆ అడవులలో"" అభిరామ"" అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా చేసే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు....
ఒక రోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన్న శవాన్ని చూస్తాడు....
అతని నాడిని చూసి ఎక్కడో ఒక మూల ప్రాణం ఉందని గ్రహించి అతన్ని తీసుకెళ్లి తన వైద్యం తో బ్రతికిస్తాడు....

మెలకువ వచ్చిన తర్వాత వేమన ఏమీ మాట్లాడేవాడు కాదు....
మౌనంగా కూర్చునేవాడు...
ఏ వివరాలూ ఎంత అడిగినా చెప్పేవాడు కాదు...
మహా మౌనంగా ఉండేవాడు...
తాను చేసే వైద్య వృత్తిలో కాస్త మక్కువ చూపేవాడు....
విస్వద చెప్పిన సత్యం,,,,నాగులు,,,తురగారాముడు చేసిన మోసం కళ్ళముందు కదిలేవి....
తానే యామరపాటుగా ఉన్నానని తెలుసుకునే వాడు..
ఆకులు అలముల కోసం అప్పుడదప్పుడూ అడవులకెళ్లి తెచ్చేవాడు....

అభిరాముడు..తన గురువుగారైన విశ్వకర్మ యోగి ని
కలిసి జ్ఞానాన్ని తెలిసుకుంటూ ఉండేవాడు....
ఒక రోజు విశ్వకర్మయోగి తాను శరీరం వదిలేస్తున్నానని,,,
తాను సంపాదించిన జ్ఞానాన్ని తనకు వాహకత్వం ఇస్తానని
రేపు రావలసిందిగా చెబుతాడు...
అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు...

మరుసటి రోజు అభిరాముడు ఆకుల కోసమని వేమనతో చెప్పి బయలుదేరుతాడు...
దారిమధ్యలో ఒక పులి కనబడడంతో పరుగులు పెడతాడు....
దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు......
అభిరాముడు ఎంతకూ ఆకులు తీసుకురాలేదని గ్రహించి చీకటి పడుతుండడంతో వేమన బయలుదేరుతాడు....

వేమన సరాసరి విశ్వకర్మయోగి ఉన్న గుహలోకి వెళతాడు.....
విశ్వకర్మయోగి చెందవలసిన వాడు,,,,
రావలసిన వాడు రానే వచ్చాడు ,,
అని వేమన్నను పిలిచి ధ్యాన,,,జ్ఞాన,విద్యను నేర్పించి,,
మూడొకన్నును ఉద్దేపనం చెందించి వాహకత్వం ఇచ్చి శరీరం వదిలేస్తాడు....
ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది....
అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు....
తాను పొందవలసిన దాన్ని పొందలేక పోయానని బోరున విలపిస్తాడు....

వేమన దానికి అభిరామా....దుఃఖిించకు ,,భాధ పడకు,,,
నా ప్రేయసి నా కళ్ళు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ
నేను పెడచెవిన పెట్టాను....ఈ రోజు నువ్వు పొందవలసిన దాన్ని దైవం ఇచ్చలో భాగంగా నేను పొందడం జరిగింది...

విస్వద...అభిరామా ఇద్దరూ చెబుతూ వుంటే వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను
అని చెబుతాడు...

విస్వద అభిరామా ఇద్దరూ కలిసి వినరా వేమా...
అని నాకు భోధిస్తున్నట్టుగా,,,చెబుతున్నట్టుగా 
ప్రపంచానికి చెబుతాను అని చెబుతాడు... 
అందుకే..విశ్వదాభిరామా  వినురావేమా..!

ఇది నాకిష్టమైన పద్యం.💐

కుండ కుంభమన్నా,,కొండ పర్వతమన్నా,,
నుప్పు లవనమన్నా,,నొకటి కాదే
భాషలిట్టే వేరు పరతత్వం ఒక్కటే
విశ్వదాభి రామ వినురవేమ....!

కుండ అన్నా,,,కుంభమన్నా,,,

ఉప్పు అన్నా,,,లవన మన్నా,,,

కొండ అన్నా,,,పర్వతం అన్నా,,,

అంతా ఒక్కటే.....భాషలే వేరు....
భగవంతుని తత్వం ఒక్కటే...

 వేమన్న... భాషలు వేరు కానీ భావం ఒక్కటే...
భాషలు వేరే....కానీ ఉన్నది ఆ ఒక్కటే భగవంతుడు..అని తెలియచెప్పాడు.

లోకా సమస్తా సుఖినోభవంతు!
















Family:

Comments

Popular posts from this blog

Reddy Dynasty

Hinduism

పెద్దరికం